జాతీయ వార్తలు

ప్రాజెక్టులకు నిధులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 20: తెలంగాణ నీటి ప్రాజెక్టులకు ఆర్థిక సాయం అందించాలని రాష్ట్ర ఐటీ, పురపాలక మంత్రి కె తారక రామారావు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. కెటిఆర్ రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో బుధవారం బిజీబిజీగా గడిపారు. కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, స్మృతి ఇరానీలను కలిసి పలు ప్రతిపాదనలను కేంద్రం ముందుంచారు. కేంద్ర సమాచార మంత్రి వెంకయ్యనాయుడితో జరిగిన సమావేశం వివరాలను మీడియాకు వెల్లడిస్తూ, రాష్ట్రంలో ఫార్మా సీటీ ప్రాజెక్టుకు హడ్కో ద్వారా రూ.785 కోట్లు సాయం అందించాలని కోరారు. మూసీ నది ప్రక్షాళనకు ఎన్నార్పీ ద్వారా రూ.900 కోట్లు మంజూరు చేయాలని కోరామన్నారు. హైదరాబాద్‌లో స్కైవాక్‌లు, ఎస్సార్బీపీల గురించి మంత్రికి వివరించామని, మురుగు నీటి వ్యవస్థ, రోడ్ల అభివృద్ధికి కేంద్ర సాయం కోరామన్నారు. దీంతోపాటుగా బ్రిక్స్ నుంచి రూ.75 వేల కోట్ల రుణానికి చొరవ చూపాలని కోరినట్టు చెప్పారు. తెలంగాణ ప్రతిపాదించిన పలు అంశాలపై త్వరలో సమావేశం ఏర్పాటు చేసి చర్చిద్దామని వెంకయ్య హామీ ఇచ్చినట్టు కెటిఆర్ వెల్లడించారు. కాగా కేంద్ర జౌళి మంత్రి స్మృతిఇరానీతో కెటిఆర్ సమావేశమయ్యారు. ఆ వివరాలను మీడియాకు వెల్లడిస్తూ, వరంగల్‌లో టెక్స్‌టైల్ పార్క్ ప్రారంభోత్సవానికి స్మృతిని ఆహ్వానించామన్నారు. తెలంగాణలో చేనేత, జౌళి శాఖ సమస్యలను కేంద్రమంత్రికి వివరించామన్నారు. చేనేత సమస్యల పరిష్కరానికి త్వరలో తెలంగాణలో స్మృతిఇరానీ పర్యటిస్తారన్నారు. కాంగ్రెస్ పనికిమాలిన పార్టీఅని, మీడియాలో ప్రచారం కోసమే నేతలు యాత్రలు చేస్తున్నారని దుయ్యబట్టారు. అవసరమైన రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టకుండా నీటిని ఎక్కడ నిల్వచేస్తారని ప్రశ్నించారు. తెలంగాణ నీటి ప్రాజెక్టులను హర్యానా ప్రాజెక్టులతో పోల్చడం అవివేకానికి నిదర్శనమన్నారు.