జాతీయ వార్తలు

జిఎస్‌టిపై తొలగని ప్రతిష్టంభన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 15: ఆర్థిక సంస్కరణల్లో అత్యంత కీలకమైన వస్తు సేవల పన్ను (జిఎస్‌టి) బిల్లును ప్రస్తుత పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే ఆమోదింపజేసుకోవడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో ఏమాత్రం పురోగతి కనిపించడం లేదు. సోమవారం ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష నాయకులు గులాం నబఈ ఆజాద్, ఆనంద్ శర్మలతో ఈ బిల్లుపై జరిపిన చర్చలు అర్ధంతరంగా ముగిసిన విషయం తెలిసిందే. ఈ సమావేశానికి ఖర్గే కూడా వచ్చి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. కాగా, మంగళవారం పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయడు లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గేతో మాట్లాడడానికి రెండుసార్లు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో ఎలాంటి వారసత్వాన్ని అందించాలని అనుకుంటున్నారో ఆలోచించాలని ప్రభుత్వం మరోసారి కాంగ్రెస్ పార్టీకి విజ్ఞప్తి చేసింది. జిఎస్‌టి అంశంపై కాంగ్రెస్ పార్టీ ప్రతిరోజూ తన వైఖరిని మార్చుకుంటోందని మంగళవారం జరిగిన బిజెపి పార్లమెంటరీ పార్టీ సమావేశంలో జైట్లీ అన్నారు. మరోవైపు బిజెపి అధ్యక్షుడు అమిత్ షాతో బిజెపి నాయకులు జరిపిన మరో సమావేశంలో సైతం ఈ అంశం చర్చకు వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఏదో ఒక సాకుతో పార్లమెంటు సమావేశాలకు ఎలా అడ్డుపడుతోందో ఆ సమావేశంలో పార్టీ నేతలు చర్చించారు.
‘మీరు బుధవారం ఖర్గేను కలుసుకోబోతున్నారా?’ అని విలేఖరులు వెంకయ్యనాయుడ్ని అడగ్గా, ‘దీనికి ఎలాంటి డెడ్‌లైన్ లేదు. నేను వాళ్లను కలుస్తూనే ఉంటాను’ అని ఆయన చెప్పారు. మంగళవారం ఉదయంనుంచి మధ్యాహ్నం లోపల వెంకయ్యనాయుడు రెండు సార్లు ఖర్గేను కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నించారని, అయితే ఆ ప్రయత్నాలు ఫలించలేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. జిఎస్‌టిని అమలు చేయడానికి వీలుగా తీసుకువచ్చే రాజ్యాంగ సవరణ బిల్లుకు ప్రస్తుత సమావేశంలో ఆమోదం లభించే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా అని విలేఖరులు వెంకయ్యనాయుడ్ని అడగ్గా, సమావేశాల చివరి రెండు మూడు రోజుల్లో ఏదోఒక అవకాశం ఉండవచ్చు అని ఆయన చెప్పారు.
కాంగ్రెస్‌తో పాటుగా ఎవరు కూడా జిఎస్‌టి బిల్లును వ్యతిరేకించడం లేదనే విషయాన్నికూడా ఆయన గుర్తు చేసారు. కాగా, చాలా ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే బిల్లుకు తమ మద్దతు ప్రకటించినందున సభలో బిల్లును ప్రవేశపెడితే కాంగ్రెస్ పార్టీ కూడా దానికి వ్యతిరేకంగా ఓటు వేయడానికి వీలుండదని, అందుకే ఏదో ఒక గొడవ సృష్టించి బిల్లును రాజ్య సభలో ప్రవేశపెట్టకుండా చూడడానికి ఆ పార్టీ ప్రయత్నిస్తోందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.