జాతీయ వార్తలు

‘ట్రిపుల్ తలాక్’ను పరిశీలించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 29: ముస్లిం మతంలో అమలవుతున్న ‘తలాక్’ (ట్రిపుల్ తలాక్) విధానం రాజ్యాంగ చట్రం ప్రమాణాలకు అనుగుణంగా ఉందో లేదో పరిశీలించనున్నట్లు సుప్రీంకోర్టు బుధవారం తెలిపింది. తలాక్ చెప్పి విడాకులిచ్చే విధానం ప్రజలలో ఓ పెద్దవర్గాన్ని ప్రభావితం చేస్తోందని, అందువల్ల ఇది చాలా ముఖ్యమైన అంశమని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ట్రిపుల్ తలాక్‌కు అవకాశం ఇస్తున్న ముస్లిం పర్సనల్ లాను రాజ్యాంగ చట్రం ప్రమాణాలతో పరిశీలించాల్సి ఉందని ధర్మాసనం తెలిపింది. ముస్లిం పర్సనల్ లా అంశాన్ని పరిశీలించడానికి అంగీకరిస్తూ సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఇరువైపులా చాలా బలమైన దృక్పథాలు ఉన్నందున ఈ అంశంపై తాము నేరుగా ఏదో ఒక నిర్ధారణకు రావడం లేదని ప్రధాన న్యాయమూర్తి టి.ఎస్.్ఠకూర్, న్యాయమూర్తి ఎ.ఎం.ఖాన్‌విల్కర్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. ఈ అంశంపై ఆరు వారాల్లోగా వైఖరి తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ, కేసు తదుపరి విచారణను సెప్టెంబర్ ఆరో తేదీకి ధర్మాసనం వాయిదా వేసింది.
విచారణ సందర్భంగా సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ తన వాదన వినిపిస్తూ పర్సనల్ లా.. ప్రాథమిక హక్కుల పరిధిలోకి రాదని గతంలో బొంబాయి హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావించారు. ‘అందరూ తమ అభిప్రాయాలను చెప్పొచ్చు. చర్చలో పాల్గొనవచ్చు. అన్ని పక్షాల వైఖరి ఏమిటో మేము తెలుసుకుంటాం’ అని ధర్మాసనం పేర్కొంది. అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డ్ (ఎఐఎంపిఎల్‌బి), ఇతరులు తమ అభిప్రాయాలను టివి చర్చలు సహా బహిరంగ వేదికలపై వ్యక్తం చేయకుండా నిరోధించాలని ఫరా ఫాయిజ్ అనే మహిళా న్యాయవాది కోరినప్పుడు ధర్మాసనం అందరూ చర్చల్లో పాల్గొనవచ్చనే విషయాన్ని స్పష్టం చేసింది. ‘మేము టివి షోల వల్ల ప్రభావితులం కాము. మీరు కూడా టివి షోలలో పాల్గొనవచ్చు. మీ అభ్యర్థనను పెండింగ్‌లో పెడతాము. ఒకవేళ చర్చ చేయి దాటిపోయే పరిస్థితి వస్తే అప్పుడు మేము జోక్యం చేసుకుంటాం’ అని ధర్మాసనం తెలిపింది. ఎఐఎంపిఎల్‌బి తరపు న్యాయవాది ట్రిపుల్ తలాక్ అమలును గట్టిగా సమర్థించారు. ఈ విధానాన్ని కోర్టులు కూడా సమర్థించాయని, పర్సనల్ లాను రాజ్యాంగ ప్రమాణాలతో పరీక్షించజాలమని చెప్పాయని పేర్కొన్నారు. బుధవారం నాటి విచారణలో మొత్తం నాలుగు పక్షాలు పాల్గొన్నాయి. ధర్మాసనం ఆ నాలుగు పక్షాలూ కేసులో ఇంప్లీడ్ కావడానికి అనుమతించింది.