జాతీయ వార్తలు

ఇది తెలంగాణ ఆత్మాభిమానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ,జూన్ 28: రాష్ట్ర హైకోర్టు విభజన వ్యవహారం కేవలం న్యాయమూర్తులు, న్యాయ వాదుల సమస్య కాదు, నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల ఆత్మాభిమానంతో సంబంధం ఉన్న సమస్య అని తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపిలు కేంద్ర న్యాయ శాఖ మంత్రి సదానంద గౌడకు స్పష్టం చేశారు. హైకోర్టు విభజన వ్యవహారం ముదిరితే తీవ్ర పరిణామాలుంటాయని వారు మంగళవారం గౌడను కలిసి వివరించారు. దీనికి సదానంద గౌడ స్పందిస్తూ బుధవారం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలిసి హైకోర్టు విభజన గురించి చర్చిస్తానని హామీ ఇచ్చారు. హైకోర్టును వీలున్నంత త్వరగా విభజించటం ద్వారా తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టాలని ఎంపీలు సదానంద గౌడకు విజ్ఞప్తి చేశారు.
హక్కులకు భంగం కలగటంతోపాటు అన్యాయం జరగటం వల్లనే న్యాయమూర్తులు, న్యాయవాదులు నిరసన తెలుపుతున్నారని వినోద్‌కుమార్, జితేందర్ రెడ్డి, కే.కేశవరావు, విశే్వశ్వర రెడ్డి, బి.బి.పాటిల్, సీతారాం నాయక్, నరసయ్య గౌడ్, కె.శ్రీనివాస్‌రెడ్డి కేంద్ర మంత్రితో చెప్పారు. జూనియర్, సివిల్ న్యాయమూర్తులు సంవత్సరం నుండి హైకోర్టుకు విన్నవించుకుంటున్నా పట్టించుకోవటం లేదని వారు తెలిపారు. ఏపిలో పుట్టిన వారిని తెలంగాణలో న్యాయమూర్తులుగా నియమించటం ఏమిటని వినోద్‌కుమార్ ప్రశ్నించారు. విభజన చట్టం ప్రకారం హైకోర్టును విభజించాలని కోరటం అన్యాయమా అని ఆయన నిలదీశారు. ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన న్యాయమూర్తులను తెచ్చి హైదరాబాదులో నియమించటం ఏమిటని జతేందర్ రెడ్డి ప్రశ్నించారు. గిల్లికజ్జాలు పెట్టి న్యాయమూర్తులు, న్యాయవాదులను రోడ్డుపైకి తెచ్చారని ఆయన ఆరోపించారు. ఏ.పి.ప్రభుత్వం అనవసరంగా రాద్దాంతం చేస్తోందన్నారు. హైకోర్టు విభజన అంశాన్ని పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ప్రస్తావిస్తామని ఆయన తెలిపారు. కేశవరావు మాట్లాడుతూ జుడీషియల్ అధికారులు ఎక్కడి వారు అక్కడే ఉంటారని చెప్పి ఇప్పుడు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. కేంద్రం నుండి తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు యథాతథ స్థితి కొనసాగించాలని కేశవరావు డిమాండ్ చేశారు. ఆంధ్ర న్యాయమూర్తులను తెలంగాణకు పంపించటం మంచిది కాదన్నారు. తెలంగాణ వారికి రానున్న ఇరవై నుండి ముప్పై సంవత్సరాల వరకు పదోన్నతి ఉండకుండా చేసేందుకు కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు.