జాతీయ వార్తలు

భూ సేకరణ ఆర్డినెన్స్ వివరాలు వెల్లడించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 28: రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ జారీ చేసిన భూ సేకరణ ఆర్డినెన్స్‌కు సంబందించిన అన్ని రికార్డులను బహింరంగపరచాలని కేంద్ర సమాచార కమిషన్ (సిఐసి) కేంద్రాన్ని ఆదేశించింది. రాష్టప్రతి జారీ చేసిన భూ సేకరణ ఆర్డినెన్స్, దానికి సంబంధించిన ఫైల్ నోటింగ్స్ ఫోటో కాపీలు ఇవ్వాలని సమాచార హక్కు చట్టం కింద వెంకటేష్ నాయక్ గత ఏడాది జనవరిలో రాష్టప్రతి సచివాలయాన్ని కోరాడు. అయితే ఆ దరఖాస్తును ఆ తర్వాత డిపార్ట్‌మెంట్ ఆఫ్ లా రిసోర్సెస్‌కు బదిలీ చేశారు. నాయక్ కోరిన సమాచారం తన వద్ద లేదని ఆ శాఖ తెలియజేసింది. అంతేకాకుండా ఆ దరఖాస్తును కేంద్ర ప్రభుత్వ లెజిస్లేటివ్ డిపార్ట్‌మెంట్‌కు పంపించారు. అయితే నాయక్ కోరిన సమాచారం గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ పరిధిలోకి వస్తుందని, ఆర్డినెన్స్ జారీకి సంబంధించిన రికార్డులన్నీ కూడా డిపార్ట్‌మెంట్ ఆఫ్ లాండ్ రిసోర్సెస్ వద్దనే ఉంటాయని లెజిస్లేటివ్ డిపార్టమెంట్ తెలియజేసింది. తాను అడిగిన సమాచారం ఇవ్వకుండా బాధ్యతను ఇతర శాఖలపైకి నెట్టివేయడంతో విసిగిపోయిన నాయక్ గత ఏడాది మేలో సిఐసికి అపీలు చేశాడు. గత వారం విచారణ సందర్భంగా ఇన్ఫర్మేషన్ కమిషనర్ సుధీర్ భార్గవ, ఆర్డినెన్స్ జారీకి సంబందించిన రికార్డులన్నీ కూడా డిపార్ట్‌మెంట్ ఆఫ్ లాండ్ రిసోర్సెస్ వద్ద అందుబాటులో ఉంటాయంటూ లెజిస్లేటివ్ డిపార్ట్‌మెంట్ ఇచ్చిన సమాధానాన్ని ఉదహరించారు. అందువల్ల, ఫిర్యాదుదారు కోరిన సమాచారాన్ని నాలుగు వారాల్లోగా అతనికి ఇవ్వాలని కమిషన్ కేంద్రాన్ని ఆదేశించింది. 2014 డిసెంబర్‌లో కేంద్ర ప్రభుత్వం తొలిసారిగా భూ సేకరణ ఆర్డినెన్స్‌ను జారీ చేసింది. అయితే దీనికి సంబంధించిన బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందకపోవడంతో కేంద్రం ఇదే ఆర్డినెన్స్‌ను మరోరెండు సార్లు- గత ఏడాది మేలో ఒకసారి, ఆ తర్వాత డిసెంబర్‌లో మరోసారి తిరిగి జారీ చేసింది. అయితే ఈ అంశంపై ప్రతిపక్షాలనుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురయిన దృష్ట్యా మరోసారి ఈ ఆర్డినెన్స్‌ను తిరిగి జారీ చేయరాదని ఈ ఏడాది మార్చిలో కేంద్రం నిర్ణయించుకుంది.
దీనికి సంబంధించిన సవరణ బిల్లును పార్లమెంటు ఉభయ సభల సంయుక్త కమిటీ పరిశీలిస్తోంది. పార్లమెంటు వర్షాకాల సమావేశాల తొలివారం చివరి రోజున ఆ కమిటీ తన నివేదికను సమర్పించాల్సి ఉంది.