జాతీయ వార్తలు

ప్రజాస్వామ్యమే భారత్ బలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 26: ప్రజాస్వామ్యమే భారతదేశానికి తిరుగులేని బలమని, దీన్ని మరింత శక్తిమంతంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఎంతో ఉందని ప్రధాని నరేంద్రమోదీ ఉద్ఘాటించారు. నాలుగు దశాబ్దాల క్రితం దేశంలో ఎమర్జెన్సీ విధించారని పేర్కొన్న ఆయన ఆ చీకటి రోజుల నుంచి బయటపడి భారత దేశం ప్రజాస్వామ్యయుతంగా బలమైన అడుగులు వేస్తూ దూసుకుపోతోందని ఆయన అన్నారు. భారత పౌరుల ప్రజాస్వామ్య హక్కులు, వాటి శక్తి ఎంత పటిష్టమైనదో ఎమర్జెన్సీ కాలంలోనే రుజువైందని, ఈ వాస్తవాలు అనునిత్యం స్మరిస్తూ ముందుకు వెళ్లాలని మోదీ తెలిపారు. ఆదివారం మన్‌కీ బాత్‌లో భాగంగా 1975నాటి ఎమర్జెన్సీ పరిస్థితులను మోదీ గుర్తు చేశారు. చాలా సందర్భాల్లో మన్‌కీ బాత్ కార్యక్రమం పట్ల విమర్శలు, అవహేళనలు వస్తున్నాయని, అందుకు కారణం ప్రజాస్వామ్యం పట్ల ప్రతి ఒక్కరు నిబద్ధతాయుతంగా ఉండటమేనని తెలిపారు. ‘‘ప్రజాస్వామ్యమే మన బలం. ప్రజాబలమే మన బలం. ప్రతి పౌరుడి బలమే మన బలం అన్న వౌలిక వాస్తవాన్ని నిరంతరం గుర్తుంచుకోవాలని, ఇదేవిధంగా ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేసుకోవా’’లని పిలుపునిచ్చారు. 1975 జూన్ 26న విధించిన ఎమర్జెన్సీ కారణంగా ప్రజాస్వామ్యం అణచివేతకు గురైందని, ప్రజాహక్కులన్నీ హరించుకుపోయాయని, మొత్తం భారత దేశమే కారాగారంగా మారిందని మోదీ గుర్తు చేశారు. జయప్రకాశ్ నారాయణ్‌తో పాటు లక్షలాది ప్రజలు, వేలాది మంది నాయకులు జైలుపాలయ్యారన్నారు. అయినప్పటికీ కూడా ఆ చీకటి రోజులను ఛేదించుకుని తేజోవంతంగా ప్రజాస్వామ్యం కొత్త శక్తితో ముందుకొచ్చిందంటే అందుకు దేశప్రజల నిబద్ధతే కారణమని తెలిపారు. ప్రజాస్వామ్యమే తమ సర్వస్వంగా ప్రతి పౌరుడు భావించటం వల్ల ఈ ఉన్నత వ్యవస్థను కాపాడుకుంటూ వస్తున్నామన్నారు. ఎప్పటికప్పుడు ప్రజలు తమ హక్కులతో పాటు తమకున్న శక్తిని కూడా గుర్తుంచుకుని ముందుకు సాగాల్సి ఉంటుందని, కేవలం ఓటేసి అయిదేళ్ల పాటు పాలించే కాంట్రాక్టు ఓ పార్టీకి అప్పగించటంతో ప్రజల బాధ్యత తీరిపోలేదని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఓటింగ్ అన్నది కీలకమైనా, అన్నింటికంటే ముఖ్యం పరిపాలనలో ప్రజాభాగస్వామ్యమని స్పష్టం చేశారు. ఎంతగా ప్రభుత్వాలు ప్రజలతో మమేకం అయితే, అంతగానూ దేశం బలోపేతం అవుతుందన్నారు. అన్నిరకాల జాడ్యాలకు ప్రధాన కారణం ప్రజలకు, ప్రభుత్వాలకు మధ్య అగాధం పెరిగిపోవటమేనని స్పష్టం చేశారు. ఈ వాస్తవాన్ని గుర్తు పెట్టుకుని ప్రజాభాగస్వామ్యమే పరమావధిగా తాను ముందుకు వెళ్తున్నానన్నారు.