జాతీయ వార్తలు

భారత్‌ను అస్థిరపరిచే కుట్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫతేగఢ్ సాహిబ్ (పంజాబ్), జూన్ 26: భారతదేశాన్ని అస్థిర పరచేందుకు పొరుగుదేశం కుట్ర చేస్తోందని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జమ్ము కాశ్మీర్‌లోని పాంపోర్‌లో ఎనిమిది మంది సిఆర్‌పిఎఫ్ జవాన్లను పాక్ ప్రేరేపిత లష్కర్ ఉగ్రవాదులు విచక్షణారహితంగా హతమార్చటంపై రాజ్‌నాథ్ ఆదివారం స్పందించారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణకు ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శిని ఆదేశించినట్లు ఆయన వివరించారు. ఇద్దరు సభ్యులతో కూడిన ఈ బృందం పాంపోర్ వెళ్లి అక్కడ భద్రతాపరమైన లోపాలను సమీక్షిస్తుందని, తద్వారా భవిష్యత్తులో జవాన్లు ఈ రకమైన దాడులవల్ల మృత్యువాత పడకుండా చూడవచ్చని రాజ్‌నాథ్ అన్నారు. ప్రముఖ సిక్కు వీరుడు బాబా బందా సింగ్ బహదూర్ 300 అమరుడైన దినం సందర్భంగా ఆయన నివాళులు అర్పించారు. ‘ఈ ఉగ్రవాదులు, పొరుగుదేశం మన దేశాన్ని అస్థిరపరచేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇలాంటి దుష్టశక్తుల్ని ఎదుర్కోవటానికి ముందుకు రావాలని దేశ యువతకు నేను పిలుపునిస్తున్నాను. తిరుగులేని ధైర్యసాహసాలతో పనిచేస్తున్న మన భద్రతా బలగాలను అభినందించాలి. అదే సమయంలో అమరులైన జవాన్లను భారతదేశం ఎప్పటికీ మరవకూడదు. వాళ్లు మనతోనే ఉంటారు’ అని రాజ్‌నాథ్ భావోద్వేగంతో ప్రసంగించారు. పాంపోర్‌లో శనివారం ఇద్దరు ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఎనిమిది మంది జవాన్లు మృతి చెందగా, 21మంది గాయపడిన సంగతి తెలిసిందే.

ఆదివారం ఫతేగఢ్ సాహిబ్‌కు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు స్వాగతం పలుకుతున్న పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్