జాతీయ వార్తలు

ఢిల్లీలో ‘ఆప్’ హైడ్రామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 26: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే దినేష్ మోహన్యా అరెస్టు వ్యవహారం కేంద్రానికి, ఢిల్లీ ప్రభుత్వానికి మధ్య అగాధాన్ని మరింత పెంచింది. లైంగిక వేధింపుల ఆరోపణలపై దినేష్ మోహన్యాను అరెస్టు చేయటంతో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనిష్ సిసోడియాతోపాటు 52మంది ఆప్ ఎమ్మెల్యేలు ఆదివారం ప్రధాని మోదీకి ‘లొంగిపోవటం’కోసం ఆయన అధికార నివాసం 7రేస్‌కోర్స్ రోడ్‌కు ప్రదర్శనగా బయలుదేరి వెళ్లారు. అయితే ప్రధాని నివాసానికి కిలోమీటరు దూరంలోనే మెట్రో స్టేషన్ సమీపంలో పోలీసులు సిసోడియా సహా ఎమ్మెల్యేలను నిషేధాజ్ఞలు ఉల్లంఘించారంటూ అదుపులోకి తీసుకుని, ఆ తరువాత వదిలేశారు. ఢిల్లీ అసెంబ్లీలోని 70స్థానాల్లో 67స్థానాలను గెలుచుకుని అధికారం చేపట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ తొలినాటి నుంచీ కేంద్రంతో ఘర్షణాత్మక వైఖరినే అవలంబిస్తూ వస్తోంది. దినేష్ మోహన్యా అరెస్టు అయి 24 గంటలు గడవకముందే ఉప ముఖ్యమంత్రి సిసోడియాపై తాజాగా కంప్లయింట్ రిజిస్టర్ అయింది. ఘాజీపూర్ మార్కెట్ వ్యాపారులను సిసోడియా బెదిరించినట్లు ఫిర్యాదు రావటంతో సిసోడియా తీవ్రంగా స్పందించారు. ‘్ఢల్లీ ప్రజలకోసం మా పనిని మమ్మల్ని చేసుకోనివ్వండని చెప్పేందుకే మోదీజీని కలిసేందుకు వెళ్లాను. అయినా మీరు అరెస్టు చేయాలని అనుకుంటే చేసుకోండి. మీకు ఎమ్మెల్యేలపై శత్రుత్వం ఉంటే అరెస్టు చేసుకోండి. కానీ ఢిల్లీ అభివృద్ధి పనులను మాత్రం అడ్డుకోకండి. అని పోలీసులకు చెప్పాం’ అని సిసోడియా అన్నారు. ‘మీరు (మోదీ) మమల్ని జైలుకు పంపించటం ద్వారా రాజకీయం చేయాలనుకుంటే.. మేమంతా మీదగ్గరకు వస్తాం. మా అందరినీ జైలుకు పంపించండి. తిహార్‌కు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని ఆయన అన్నారు. ఆప్ ర్యాలీపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరెణ్ రిజిజు స్పందిస్తూ ఇదంతా ఓ రాజకీయ డ్రామా అని ఎద్దేవా చేశారు.

ఢిల్లీలో ఆదివారం ప్రధాని నివాసానికి తరలివెళుతున్న ఆప్ ఎమ్మెల్యేలు,
ఉపముఖ్యమంత్రి సిసోడియాను అడ్డుకుంటున్న పోలీసులు