జాతీయ వార్తలు

28న రాజ్యసభ సభ్యుల ప్రమాణస్వీకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 24: రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన సభ్యులు ఈనెల 28న ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఏపి, తెలంగాణ, గుజరాత్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన సభ్యులతో రాజ్యసభ చైర్మన్, ఉపరాష్టప్రతి హమీద్ అన్సారీ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఈమేరకు ఉపరాష్టప్రతి కార్యాలయం ఆయా సభ్యులకు లేఖలు రాసింది. మూడు రాష్ట్రాలకు చెందిన కొత్త సభ్యులు అన్సారీ కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేసేందుకు వస్తున్నట్లు తెలిసింది. ఒకరిద్దరు సీనియర్ సభ్యులు మాత్రం వచ్చే నెల 18న పార్లమెంటు వర్షాకాల సమావేశాల సంధర్భంగా రాజ్యసభలోనే ప్రమాణ స్వీకారం చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలిసింది.
రాయలసీమకు చెందిన టిజి వెంకటేశ్ మాత్రం ఈనెల 29 లేదా 30 తేదీనాడు ప్రమాణ స్వీకారం చేసేందుకు అనుమతి ఇవ్వాలని ఉపరాష్టప్రతిని కోరినట్టు చెబుతున్నారు. వెంకటేశ్ తరపున టిడిపి పార్లమెంటరీ పార్టీ కార్యదర్శి సత్యనారాయణ ఈ మేరకు లేఖరాశారని అంటున్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన కేంద్ర మంత్రి సుజనా చౌదరి, బిజెపికి చెందిన రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు ఈనెల 28నే ప్రమాణం చేస్తారు. ఇదే విధంగా వైకాపా సభ్యుడు విజయసాయి రెడ్డి, తెరాస తరఫున ఎన్నికైన సీనియర్ నాయకుడు, మాజీ డి శ్రీనివాస్, లక్ష్మీకాంత్‌రావుకూడా మంగళవారం ప్రమాణ స్వీకారం చేస్తారు.

చెన్నై రైల్వేస్టేషన్‌లో
ఇన్ఫోసిస్ ఉద్యోగిని హత్య

చెన్నై, జూన్ 24: చెన్నై రైల్వేస్టేషన్‌లో శుక్రవారం ఉదయం ఇన్ఫోసిస్ ఉద్యోగిని హత్యకు గురైంది. ఉదయం 6.30కు ఆఫీసుకు వెళ్ళేందుకు నుంగంబాకం స్టేషన్‌కు వచ్చిన ఎస్.స్వాతి అనే ఉద్యోగిని గాయాలతో మృతి చెందింది. ఆమె ముఖంపైనా, మెడపైన గాట్లు ఉన్నాయి. రైల్వేస్టేషన్ సమీపంలోని చూలైమేడు ప్రాంతంలో నివసిస్తున్న స్వాతి రోజూ మాదిరిగానే ఆఫీసుకు వెళ్ళేందుకు స్టేషన్‌కు వచ్చిన సమయంలో హత్యకు గురైంది. స్వాతి హత్యకు కారణాలు వెల్లడి కాలేదు. చెన్నై శివారులోని మహీంద్ర వరల్డ్ సిటీలోని ఇన్ఫోసిస్ కార్యాలయంలో స్వాతి పనిచేస్తోంది. ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు, ప్రయాణికులతో అత్యంత రద్దీగా ఉండే సమయంలో ఉద్యోగిని హత్యకు గురికావడంతో స్టేషన్‌లో కలకలం చెలరేగింది. స్వాతి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. కాగా, తమ ఉద్యోగిని హత్యకు గురికావడం దురదృష్టకరమని ఇన్ఫోసిస్ ఒక ప్రకటనలో విచారం వ్యక్తం చేసింది. పోలీసుల దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తామని ప్రకటించింది.