జాతీయ వార్తలు

జూలైనాటికి జాతీయ మహిళా విధానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోయంబత్తూరు, జూన్ 14: జాతీయ మహిళా విధానం జూలై నెల మూడో వారానికల్లా సిద్ధమవుతుందని, ఒంటరి మహిళల కుటుంబాలకు సంబంధించిన సమస్యలపై దీనిలో ఒక ప్రత్యేక చాప్టర్ ఉంటుందని జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ లలితా కుమార మంగళం ఇక్కడ చెప్పారు. ఈ నెల చివరికి సిద్ధం కానున్న ముసాయిదా విధానాన్ని ప్రభుత్వం ముందుంచుతామని, వచ్చే నెల రెండోవారంకల్లా విధానం సిద్ధమయ్యే అవకాశముందని అన్నారు. ఒంటరి మహిళలను ఇప్పటివరకు వింతువులు లేదా విడాకులు ఇచ్చిన మహిళలుగా నిర్వచించారని, అయితే ఇప్పుడు భర్తలు వదిలిపెట్టినవారు లేదా చాలా కాలంగా భర్తలు కనిపించకుండా పోయినవారు, అలాగే కుటుంబ పెద్దలుగా ఉంటున్నవారిని కూడా ఈ విధానంలో ఒంటరి మహిళల కిందకు చేర్చడం జరుగుతుందని, ఈ అంశంపై ఇక్కడ జరుగుతున్న రెండు రోజుల జాతీయ వర్క్‌షాపులో పాల్గొనడానికి ఇక్కడికి వచ్చిన లలితా కుమార మంగళం చెప్పారు.
మహిళలు పెద్దగా ఉండే కుటుంబాల్లో మహిళలు, పిల్లలు తరచుగా పేదరికం, నేరాలు, హింసలాంటి వాటికి బలవుతుంటారని ఆమె చెప్పారు. అలాగే ఉద్యోగస్థులయిన మహిళల పిల్లల యోగక్షేమాలు చూడడానికి నాణ్యమైన క్రష్ సేవలు అందించడానికిగాను జాతీయ స్థాయి క్రష్ పాలసీని రూపొందించడానికి కమిషన్ ప్రయత్నిస్తోందని, ఎందుకంటే దేశంలో అలాంటి మహిళల ఇబ్బందులు క్రమంగా పెరుగుతున్నాయని ఆమె చెప్పారు.
సమర్థులైన ఉద్యోగినులు ఈ కారణంగా ఉద్యోగాలు వదిలేయడం పట్ల చాలా ప్రముఖ కంపెనీలు ఆందోళన చెందుతున్నందున ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిలో నాణ్యమైన క్రష్‌లను అందించడం ద్వారా ప్రభుత్వం వారికి సాయం అందించగలుగుతుందని ఆమె చెప్పారు. మహిళల పట్ల నేరాల గురించి అడగ్గా, దీనిపై కచ్చితమైన గణాంకాలు అందుబాటులో లేనప్పటికీ ఫిర్యాదులు చేయడానికి మహిళలు, యువతులు మందుకు వస్తుండడంతో గతంలో కన్నా ఇలాంటి నేరాలపై ఫిర్యాదు చేయడం ఎక్కువయిందని చెప్పారు. మహిళల పట్ల నేరాలు ముఖ్యంగా గృహహింసకు సంబంధించిన నేరాలు జరుగుతున్న రాష్ట్రాల జాబితాలో ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్ అగ్రస్థానంలో ఉండగా, బిహార్ ఆ తర్వాతి స్థానంలో ఉందని ఆమె చెప్పారు. చట్టసభల్లో మహిళలకు 3 శాతం రిజర్వేషన్లకు సంబంధించి అడగ్గా, రాజ్యసభలో బిజెపి మెజారిటీ సాధించగానే ఈ బిల్లుతోసహా పెండింగ్‌లో ఉన్న బిల్లులన్నీ కూడా ఆమోదం పొందుతాయన్న ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేశారు.

నిహ్లానీని తొలగించండి

సెన్సార్ బోర్డును ప్రక్షాళన చేయండి
‘ఉడ్తా పంజాబ్’ నిర్మాతల డిమాండ్

ముంబై, జూన్ 14: కేవలం ఒకే ఒక కట్‌తో ‘ఉడ్తా పంజాబ్’ సినిమా విడుదలకు ఆదేశాలిచ్చిన ముంబై హైకోర్టు తీర్పును ఆ సినిమా నిర్మాతలు స్వాగతించారు. అయితే ఈ సినిమాకు అనుమతినిచ్చే విషయంలో వివాదాన్ని సృష్టించిన కేంద్ర సెన్సార్ బోర్డు చైర్మన్ పహ్లాజ్ నిహ్లానీని తక్షణం ఆ పదవి నుంచి తొలగించాలని ఉడ్తా పంజాబ్ సహ నిర్మాత అనురాగ్ కశ్యప్ డిమాండ్ చేశారు. ‘నిహ్లానీతో పెద్ద సమస్య ఉంది. ఆయన్ను వెంటనే తొలగించాలి. కానీ, కొత్తగా వచ్చేవాళ్లు సరిగ్గా వ్యవహరిస్తారని నమ్మకం ఏమిటి? సినిమటోగ్రాఫ్ చట్టాన్ని నిహ్లానీ కంటే దారుణంగా వక్రీకరించి భాష్యం చెప్పరని గ్యారంటీ ఏమిటి? అందుకే మొత్తం సెన్సార్ బోర్డు వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది’ అని అనురాగ్ అన్నారు. మాదకద్రవ్యాలు ప్రధాన ఇతివృత్తంగా నిర్మాణమైన ఈ సినిమాలో పలు దృశ్యాల తొలగింపునకు సెన్సార్ బోర్డు ఆదేశించగా బాంబే హైకోర్టు కేవలం ఒకే ఒక కట్‌తో సినిమాకు క్లియరెన్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ‘ఇలాంటి కేసుల్లో సాధారణంగా రాజకీయాలు ప్రవేశిస్తాయి. ప్రజలు ఎక్కువగా రక్షణాత్మక పరిస్థితిలో పడిపోతారు. అన్ని ఆశలూ కోల్పోతాం. కానీ ఈ సినిమా విషయంలో మేం దేన్నైతే నమ్మామో దానిపైనే పోరాడాం. పరిశ్రమ కూడా మా వెంట నడిచింది’ అని కశ్యప్ అన్నారు. ఈ విషయంలో సినిమా పరిశ్రమ నుంచి పలువురి మద్దతు లభించటం అద్భుతం. ఇలాంటి కేసుల్లో పరిశ్రమ ఒక్కతాటిపై నిలవటం అవసరమని అన్నారు.