జాతీయ వార్తలు

ఉన్నత విద్యకు పది స్టార్టప్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 3: యువ పారిశ్రామికవేత్తల్లో శక్తి, ఉత్సాహాన్ని నింపేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల్లో పది ఉన్నత విద్యా ‘స్టార్ట్ అప్స్’లను ఏర్పాటు చేస్తామని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ ప్రకటించారు. స్మృతి ఇరానీ శుక్రవారం ఢిల్లీలోని తన కార్యాలయం నుంచి డిజిటల్ వ్యవస్థ ద్వారా ఆంధ్రప్రదేశ్, చత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలలో ఏర్పాటు చేస్తున్న కొత్త మోడల్ డిగ్రీ కాలేజీల శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉన్నత విద్యా రంగంలో పదిస్టార్డ్‌అప్స్‌లను ప్రారంభిస్తామని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. నైపుణ్య భారత్ (స్కిల్ ఇండియా) కార్యక్రమాన్ని అమలు చేసే కార్యక్రమంలో భాగంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో 35 జీవనోపాధి కాలేజీలను ఏర్పాటు చేయనున్నట్లు ఆమె వెల్లడించారు. జాతీయ ఉన్నత స్థాయి విద్యావిధానం పరిధిలో ఈ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. దేశంలోని వివిధ భాషలను ప్రోత్సహించేందుకు ఆధునిక భాషా లాబొరేటరీలను ఏర్పాటు చేస్తామంటూ ప్రతి రాష్ట్రంలో ఇలాంటిదాన్నొకటి ఏర్పా టు చేయనున్నట్లు స్మృతి ఇరానీ చెప్పారు. విద్యా రంగంలో పరిపాలనా సంబంధమైన సంస్కల అమలు, సుపరిపాలనను ప్రోత్సహించటం, సంస్కరణలు తీసుకొస్తామని మంత్రి పేర్కొన్నారు. దేశంలోని 115 విశ్వవిద్యాలయాలు,1183 కాలేజీల్లో వౌలిక సదుపాయల కల్పనకు మొదటిసారి ఈ పథకం కింద నిధులు మంజూరు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూ లు జిల్లాలోని ఆత్మకూరులో మోడల్ డిగ్రీ కాలేజీని స్మృతి ఇరానీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. మోడల్ డిగ్రీ కాలేజీగా అప్‌గ్రేడ్ అయిన ఆత్మకూరు డిగ్రీ కాలేజీతో వెనుకబడిన కర్నూలు జిల్లాలో విద్యా వ్యవస్థలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయని అన్నారు. కాగా ఆత్మకూరులో మోడల్ డిగ్రీ కాలేజీని 12 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారు. రుసా కింద చేపడుతున్న శంకుస్థాపన కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి, విధాన మండలి చైర్మన్ చక్రపాణి, ఇతర సీనియర్ అధికారులు హాజరైనట్టు మంత్రి తెలిపారు.
రాష్ట్రాలను సంప్రదించాకే
విధాన ప్రకటన
జాతీయ విద్యావిధానం (ఎన్‌ఇపి) రూపకల్పనపై టిఎస్‌ఆర్ సుబ్రమణియన్ నేతృత్వంలోని కమిటీ చేసిన సిఫార్సులను అన్ని రాష్ట్రాలతో పం చుకున్న తరువాతనే కమిటీ నివేదికను బహిర్గతం చేస్తామని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి (హెచ్‌ఆర్‌డి) మంత్రి స్మృతి ఇరానీ స్పష్టం చేశారు. మాజీ కేబినెట్ సెక్రెటరి సుబ్రమణియన్ తన నివేదికలోని అంశాలను హెచ్‌ఆర్‌డి మంత్రిత్వ శాఖ బహిర్గతం చేయాలని, లేకుంటే తానే ఆ పని చేస్తానని పేర్కొంటూ రాసిన లేఖ గురించి శుక్రవారం ఇక్కడ విలేఖరుల సమావేశంలో స్మృతి ఇరానీని అడగగా, ‘ఈ విద్యావిధానం పత్రికలకు, ప్రసార సాధనాలకు ఎక్కాలని కోరుకునే ఒక్కరి వారసత్వ ఆస్తిగా మారబోదు’ అని ఆమె బదులిచ్చారు. ‘20కి పైగా రాష్ట్రాల్లోని 500కు పైగా జిల్లాల్లో గల 5వేలకు పైగా బ్లాకుల్లో విస్తరించి ఉన్న ఒక లక్షా పది వేల గ్రామాలకు చెందిన ఆస్తి ఇది. ఏ సిఫార్సయినా అది విధాన ముసాయిదాగా తయారు కాకముందే దాని గురించి వారితో పంచుకుంటాం’ అని మంత్రి అన్నారు. జాతీయ విద్యావిధానం ముసాయిదా తయారీ ప్రక్రియ ప్రారంభానికి ముందే దానిని బహిర్గతం చేయడానికి ముందు అన్ని రాష్ట్రాలతో పంచుకోవాలనేది తమ వాగ్దానమని ఆమె పేర్కొన్నారు.

చిత్రం... రాష్ట్రీయ ఉచ్ఛతర్ శిక్షా అభియాన్ కార్యక్రమం కింద డిజిటల్ ప్రాజెక్టులను ప్రారంభిస్తున్న కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖమంత్రి స్మృతి ఇరానీ