జాతీయ వార్తలు

అవినీతికి అడ్డుకట్ట వేశాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 27: దేశానికి దిశ, దశను నిర్దారించే నిర్ణయాత్మక ప్రభుత్వాన్ని ప్రజలకు అందజేసిన ఘనత బిజెపికే దక్కుతుందని ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా అభిప్రాయపడ్డారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్‌డిఏ ప్రభుత్వం రెండేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా అమిత్ షా శుక్రవారం విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. దేశంలో అవినీతికి స్థానం లేకుండా చేశామని, సమాజంలోని అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికోసం పలు పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నామని ఆయన చెప్పారు. ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో జవాబుదారీతనాన్ని నెలకొల్పామని షా చెప్పారు. ప్రతిపక్షం సైతం తమ ప్రభుత్వం అవినీతి ఆరోపణలు చేయలేకపోయిందన్నారు. ప్రజల తక్షణ సమస్యలను అతితక్కువ సమయంలో పరిష్కారించామన్నారు. నీట్ సమస్య ఇందుకు తాజా ఉదాహరణ అని ఆయన చెప్పారు. 21 శతాబ్దం భారత దేశానిదనేది ఎన్‌డిఏ ప్రభుత్వం చేసి చూపించిందన్నారు. జన్‌ధన్ ద్వారా 31 కోట్ల ఖతాలు తెరిపించారు, 17కోట్ల రూపీ కార్డులు పంపిణీ చేయించిందన్నారు. మూడున్నర కోట్ల మందికి చిన్న రుణాలను ప్రభుత్వం అందజేసిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చీకటిని పారదోలేందుకు పెద్దఎత్తున విద్యుదీకరణం చేశామని, మహిళలకు విముక్తి కలిగించేందుకు 6కోట్ల మందికి వంటగ్యాస్ సరఫరా చేశామని అమిత్ తెలిపారు. బడుగు, బలహీన వర్గాలకు గృహ నిర్మాణ పథకాన్ని పెద్దఎత్తున అమలు చేస్తున్నామని చెప్పారు. సర్వాంగ, సంపూర్ణ పంటల బీమా పథకాన్ని రైతులకు అందజేశామని వివరించారు. కొరత లేకుండా యూరియా సరఫరా చేస్తున్నామని తెలిపారు. నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్థిక సహాయం చేస్తున్నామని అన్నారు. యువ పారిశ్రామికవేత్తలను తమ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. స్టాండఅప్, స్టార్టప్, ముద్రా బ్యాంకు ఈ లక్ష్య సాధనకోసం ఏర్పాటు చేసినవేనని చెప్పారు. పరిపాలనా యంత్రాంగాన్ని సంస్కరించాము, బొగ్గు, ఖనిజాలు, ఎఫ్‌ఎం వేలంపాటల్లో అవినీతికి స్థానం లేకుండా చేశామని తెలిపారు. ఎల్‌ఇడి బల్బుల ద్వారా పేద ప్రజల విద్యుత్ బిల్లులను తగ్గించామన్నారు. నమామి గంగే, కూతురును చదివించండి, కూతురును రక్షించండి, స్వచ్చ భారత్ పథకాల ద్వారా దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చేందుకు కృషి జరిగిందని ఆయన వివరించారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రతి పదిహేను రోజులకు ఒకసారి క్యాబినెట్ మంత్రులతో సమావేశమై అభివృద్ధి పనులను సమీక్షిస్తున్నారని అమిత్ షా చెప్పారు. ఎన్‌డిఏ ప్రభుత్వ హయాంలో నిత్యావసర వస్తువుల ధరలను ఎందుకు అదుపు చేయలేకపోతున్నారని ఒక విలేఖరి ప్రశ్నించగా, ధరలు చాలావరకు అదుపులోనే ఉన్నాయని అమిత్ షా బదులిచ్చారు. కేంద్ర మంత్రివర్గం విస్తరణ, పునర్‌వ్యవస్థీకరణ గురించి మాట్లాడేందుకు ఆయన నిరాకరించారు. తమ పార్టీలో దళితులకు సముచిత స్థానం లభిస్తోందని షా చెప్పారు. దేశంలోని 33 కోట్ల మందికి తాగునీరు లభించటం లేదు అయినా మీ ప్రభుత్వం అభివృద్ధి సాధించామని ఎలా చెప్పుకుంటారని ఒక విలేఖరి ప్రశ్నించగా, దేశంలో నెలకొన్న అనావృష్టి మూలంగా ఈ సమస్య ఎదురైందని అమిత్ షా సమాధానం ఇచ్చారు.