జాతీయ వార్తలు

రైల్వేలను గాడిలో పెడతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 27: భారతీయ రైల్వేలను గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నామని కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభు వెల్లడించారు. ఐసియులో ఉన్న రైల్వేలను బయటకు తీసుకొచ్చేందుకు అనువైన వాతావరణం కల్పించే దిశగా అనేక చర్యలు తీసుకుంటున్నట్టు శుక్రవారం ఇక్కడ స్పష్టం చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజారవాణ వ్యవస్థ అయిన భారతీయ రైల్వేలు ఇరవై, ముప్పై ఏళ్లుగా అనేక ఒడుదుడుకులను ఎదుర్కొంటోందని మంత్రి పేర్కొన్నారు. ‘ఐసియులో ఉన్న రైల్వేలను బయటకు తీసుకొస్తాం. సంస్థను ప్రజలకు మరింత చేరువగా తీసుకురావడానికి అన్ని చర్యలూ తీసుకుంటున్నాం’ అని ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ చెప్పారు. దీనికి సంబంధించి మార్గాలను అనే్వషిస్తున్నట్టు సురేష్ ప్రభు వెల్లడించారు. ‘రైల్వేల పునరుజ్జీవానికి చర్యలు తీసుకుంటున్నాం. ప్రజల అవసరాలకు అనుగుణంగా సర్వీసులుండాలి. ఆ దిశగా రైల్వే మంత్రిత్వశాఖ పనిచేస్తోంది. వచ్చే ఐదేళ్లలో దేశ ఆర్థిక వృద్ధిలో రైల్వేలను చుక్కానిగా చేయడానికి కార్యాచరణ చేపట్టాం’ అని ఆయన స్పష్టం చేశారు. సరుకుల రవాణా మందగించడంపై ఆయన మాట్లాడుతూ ‘రానున్న కాలంలో సరుకుల రవాణా 1.2 బిలియన్ టన్నులకు పెంచేందుకు కార్యాచరణ చేపట్టాం’ అని వివరించారు. డిమాండ్‌కు తగ్గట్టు ఎగుమతులు, సరుకుల రవాణా వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని సురేష్ ప్రభు తెలిపారు. రైల్వే చార్జీల పెంపు అంశం రెగ్యులేటరీ అథారిటీ చూసుకుంటుందని ఒక ప్రశ్నకు బదులిచ్చారు. ఇటీవల నూతంగా ప్రవేశపెట్టిన కొన్ని రైళ్లలో చార్జీల పెంపుపై మాట్లాడుతూ దీనికికోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసే యోచన ఉందన్నారు. ఇటీవల ప్రవేశపెట్టిన గతిమాన్ ఎక్స్‌ప్రెస్ చార్జీ శతాబ్ది, మహామానా ఎక్స్‌ప్రెస్ కంటే 25 శాతం అధికం.

విలేఖరులతో మాట్లాడుతున్న రైల్వే మంత్రి సురేష్ ప్రభు