జాతీయ వార్తలు

హామీల అమలు సులువేమీ కాదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, మే 27: పశ్చిమ బెంగాల్‌లో ఒంటిచేత్తో తన పార్టీని విజయపథంతో నడిపించిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ప్రాంతీయ పార్టీ నేతగా తన ప్రతిష్ఠను ఇనుమడింపజేసుకున్నారు కానీ ముఖ్యమంత్రిగా రెండోసారి అధికారం చేపట్టిన ఆమె అభివృద్ధి విషయంలో లెక్కలేనన్ని సవాళ్లు ఎదుర్కొంటున్నారు. కాంగ్రెస్-లెఫ్ట్ కూటమి, బిజెపి తనపై వ్యక్తిగతంగా బురదజల్లుతూ ప్రచారం సాగించినప్పటికీ వాటినన్నిటినీ అధిగమించి తిరుగులేని మెజారిటీ సాధించడం ద్వారా ఆమె కేవలం స్ట్రీట్‌ఫైటరే కాదని గొప్ప వ్యూహకర్తకూడానని నిరూపించుకున్నారు. 30 ఏళ్ల పాటు ఎదురులేని విధంగా పాలన సాగించిన లెఫ్ట్ కూటమి కంచుకోటను 2011 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి కూల్చివేసి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఉద్యోగాలు, అభివృద్ధి నినాదంతో అధికారంలోకి వచ్చినప్పటికీ భారీ రుణభారాన్ని ఎదుర్కొంటున్న కారణంగా రాష్ట్రాన్ని అనుకున్న విధంగా అభివృద్ధిపథంలో నడిపించలేకపోయారు. పారిశ్రామిక వృద్ధిని వేగవంతం చేయడానికి పెట్టుబడులకు అనువైన వాతావరణాన్ని సృష్టించలేక పోయారు. కాళీఘాట్ ఆలయానికి దగ్గర్లోని ఇరుకు వీధిలోని ఒక అంతస్థు నివాసం, అలాగే కాటన్ చీరలు, భుజానికి వేళ్లాడే గుడ్డసంచీ, హవాయి చెప్పులులాంటి నిరాడంబర వస్తధ్రారణ ఆమెను సామాన్య జనానికి చేరువ చేశాయి. ఏడుసార్లు పార్లమెంటు సభ్యురాలయిన మమత బబానీపూర్ స్థానానికి జరిగిన ఉపఎన్నికల్లో విజయం సాధించి 2011లో ముఖ్యమంత్రి పదవిని చేపట్టాక ఆ తర్వాత జరిగిన పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికలు, 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్‌కు తిరుగులేని విజయాలను సాధించి పెట్టారు. రాష్ట్రంలో పలు అభివృద్ధి ప్రాజెక్టులను ఆమె ప్రారంభించారు కానీ అదే సమయంలో శారదా చిట్‌ఫండ్ కుంభకోణం, నారదా స్టింగ్ ఆపరేషన్‌ల విషయంలో విమర్శలను సైతం ఎదుర్కొన్నారు. ముఖ్యమంత్రిగా మమత ప్రారంభించిన అభివృద్ధి పథకాల్లో బాలికలకోసం ప్రవేశపెట్టిన ‘కన్యాశ్రీ’ పథకాలు, విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేయడానికి ఉద్దేశించిన ‘సుబుజ్ సాథి’ పథకంతో పాటుగా రాష్ట్రంలోని ఎనిమిది కోట్ల మంది ప్రజలకు 2 రూపాయలకే కిలోబియ్యం పథకం ముఖ్యమైనవి. అయితే అవినీతి ఆరోపణలు ఆమె ప్రతిష్ఠతోపాటుగా పార్టీని సైతం కుదిపేశాయి. ప్రతిపక్షాలు సైతం దీనే్న తమ ప్రధాన ప్రచారాస్త్రం చేసుకున్నాయి. మధ్య తరగతి కుటుంబంలో స్వాతంత్య్ర యోధుడి కుమార్తెగా జన్మించిన మమత న్యాయ శాస్త్ర పట్టబద్ధురాలు. ప్రజా జీవితంలోకి వచ్చిన కొత్తల్లో ఆమెకు మార్గదర్శిగా నిలిచిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సుబ్రతా ముఖర్జీ ఇప్పుడు ఆమె మంత్రివర్గంలో సీనియర్ మంత్రి కావడం యాదృచ్ఛికమే.

రిజర్వాయర్లు వెలవెల
భారీగా పడిపోయిన నీటి నిల్వలు

న్యూఢిల్లీ, మే 27: దేశంలోని 91 ప్రధాన రిజర్వాయర్లలో నీళ్లు అడుగంటిపోయాయి. రిజర్వాయర్ల మొత్తం నీటి సామర్థ్యంలో 17 శాతం పడిపోయింది. కేంద్ర జల వనరుల మంత్రిత్వశాఖ గణాంకాల ప్రకారం గురువారం నాటికి రిజర్వాయర్లలో 26.816 బిలియన్ క్యూబిక్ మీటర్ల (బిసిఎం) నీరు అందుబాటులో ఉంది. వాస్తవానికి రిజర్వాయర్లలో నీటి సామర్ధ్యం 157.799 బిసిఎంలు. గత ఏడాదికి కంటే ఇది 45 శాతం తక్కువ. అలాగే గత పదేళ్లతో పోల్చుకుంటే 21 శాతం తక్కువని ప్రభుత్వం స్పష్టం చేసింది. హిమాచల్‌ప్రదేశ్, తెలంగాణ, పంజాబ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, జార్ఖండ్, మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, తమిళనాడు, కర్నాటక, కేరళ రాష్ట్రాల్లోని ప్రధాన రిజర్వాయర్లలో నీటిమట్టం పడిపోయిందని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, త్రిపుర, రాజస్థాన్‌లో గత ఏడాదితో పోల్చుకుంటే పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది. దేశంలోని మొత్తం రిజర్వాయర్లలో నీటి సామర్ధ్యం 253.88 బిసిఎంలని వివరించింది.