జాతీయ వార్తలు

21 రోజులపాటు ‘వికాస్ పర్వ్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 24: అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి చేసుకుంటున్న నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం తమ ప్రభుత్వం సాధించిన విజయాలను హైలైట్ చేయడానికి దేశంలో దాదాపు 200 కీలక ప్రాంతాలను గుర్తించింది. ఈ నెల 26నుంచి జూన్ 15 దాకా 21 రోజుల పాటు బిజెపి ‘వికాస్ పర్వ్’ను పాటించనున్నట్లు పార్టీ అంతర్గతంగా జారీచేసిన ఓ సందేశంలో తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం సాధించిన విజయాలను హైలైట్ చేయడానికి ఒక కేబినెట్ మంత్రి, ఓ సహాయ మంత్రి. జాతీయ, రాష్టస్థ్రాయి పార్టీ నేత ఉండే 33 బృందాలు ఒక్కోటి ఆరేడు కీలక కేంద్రాలను సందర్శిస్తాయి. ఈ నెల 26తో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతుంది. ఈ సందర్భంగా ఎన్డీఏకు చెందిన ప్రతి ఎంపీ కూడా తన నియోజకవర్గం పరిధిలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోను రెండు పగళ్లు, ఒక రాత్రి గడపాలని, ప్రజలతో సమావేశాలు నిర్వహించి వారి ఫిర్యాదులను పరిష్కరించాలని కూడా ఆ నోట్‌లో పేర్కొన్నారు. ఈ సమావేశాల సందర్భంగా ఆ పట్టణం లేదా ప్రాంతం సాధించిన విజయాలను హైలైట్ చేస్తూ కటౌట్లు, బ్యానర్లు ఏర్పాటు చేయాలని, ఒక్కో పథకానికి సంబంధించి ప్రధాని మోదీ సందేశాన్ని వేదిక వెనుక ప్రముఖంగా ప్రదర్శించాలని ఆ నోట్‌లో పేర్కొన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలోని ముఖ్యమైన అంశాలను తెలియజేయడానికి సామాజిక మాధ్యమాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని ప్రతి ఎంపీని, బృందంలోని సభ్యులను ఆ నోట్‌లో కోరారు. కాగా, ప్రభుత్వం సాధించిన విజయాలను విస్తృతంగా ప్రచారం చేయడానికి కేబుల్ టీవీని పెద్దఎత్తున ఉపయోగించుకోవాలని కూడా మోదీ ప్రభుత్వం యోచిస్తోంది.