జాతీయ వార్తలు

మణిపూర్‌లో ఉగ్రదాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చండేల్, మే 22: మణిపూర్‌లో ఆదివారం ఉగ్రవాదులు మారణకాండ సృష్టించారు. చండేల్ జిల్లాలో 29వ అసోం రైఫిల్స్ సైన్యంపై మెరుపుదాడి చేసి జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ సహా అయిదుగురు జవాన్లను హతమార్చారు. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో హెంగ్షి ప్రాంతంలో అసోం రైఫిల్స్ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. జవాన్ల దగ్గరున్న ఏకే రైఫిల్స్, ఒక ఇన్‌సాస్ రైఫిల్, ఒక ఎల్ ఎంజీ రైఫిల్‌ను తీసుకెళ్లారు. రెండు లేదా అంతకంటే ఎక్కువ మిలిటెంట్ల గ్రూపులే ఈ దాడిలో పాల్గొన్నట్లు అనుమానిస్తున్నారు. మరోవైపు మణిపూర్‌లోనే జరిగిన మరో మరో ఉగ్రదాడిలో అసోం రైఫిల్స్‌కు చెందిన ఒక జవాను చనిపోగా, మరో ముగ్గురు జవాన్లు గాయపడ్డారు.
కఠిన చర్యలు తీసుకుంటాం: రాజ్‌నాథ్
మణిపూర్‌లో జరిగిన ఉగ్రదాడిపై కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ తీవ్రంగా స్పందించారు. టెర్రరిస్టులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కేంద్ర హోం కార్యదర్శి రాజీవ్ మెహర్షితో పాటు ఇతర ఉన్నతాధికారులతో పరిస్థితిని రాజ్‌నాథ్ సమీక్షించారు.