జాతీయ వార్తలు

ఏటికి ఎదురీదిన ‘దీదీ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, మే 20: సైద్ధాంతికంగా తూర్పు పడమరలులాంటి వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీల కూటమి ఓటర్లపై పెద్దగా ప్రభావం చూపించకపోవడం, మమతా బెనర్జీ అభివృద్ధి మంత్రం పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్‌కు భారీ మెజారిటీని అందించడమే కాక మరోసారి అధికార పీఠంపై కూర్చోబెట్టాయి. రాష్ట్రంలోని మొత్తం 294 అసెంబ్లీ స్థానాల్లో 211 స్థానాలను గెలుచుకున్న ఆ పార్టీ 2011 ఎన్నికల్లో సాదించిన 184 స్థానాలనుంచి మరింత ఎదిగింది. అయితే ఈ సారి తృణమూల్ సాధించిన విజయానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. 2011లో ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి పోటీ చేస్తే ఈ సారి ఒంటరిగా పోటీ చేసింది. తృణమూల్ ఓటింగ్ శాతం 2011 అసెంబ్లీ ఎన్నికలు, 2014 లోక్‌సభ ఎన్నికలకన్నా పెరిగినట్లు ఎన్నిల ఫలితాలను విశే్లషిస్తే స్పష్టమవుతుంది. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్‌కు 39 శాతం, 2014 లోక్‌సభ ఎన్నికల్లో 39.03 శాతం ఓట్లు రాగా ఈ సారి ఆ పార్టీకి ఏకంగా 44.9 శాతం ఓట్లు లభించడం గమనార్హం. శారదా చిట్‌ఫండ్ కుంభకోణం, నారదా స్టింగ్ ఆపరేషన్, వివేకానంద ఫ్లైఓవర్ కూలిపోవడం లాంటి అనేక ప్రతికూల అంశాలకు ఎదురొడ్డి మమతా బెనర్జీ తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకోవడం చిన్న విషయమేమీ కాదు. అమె అభివృద్ధి నినాదం, సామాన్య ప్రజలకోసం ప్రభుత్వం ప్రకటించిన వివిధ పథకాలు ఓటర్ల దృష్టిని ఆకట్టుకున్నాయి. తనపై వచ్చిన అవినీతి ఆరోపణన్నీ కూడా మీడియాలో ఒక వర్గం చేసిన దుష్ప్రచారం మాత్రమేనని, బెంగాల్‌లో అవినీతి ఎక్కడా లేదని అసెంబ్లీ ఎన్నిల తర్వాత మమత స్పష్టం చేయడం గమనార్హం. మరో వైపు తృణమూల్‌ను గద్దె దించడమే లక్ష్యంగా చేతులు కలిపిన లెఫ్ట్‌ఫ్రంట్‌లు ఈ ఎన్నికల్లో ఓటర్లను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. 2011 అసెంబ్లీ ఎన్నిల్లో 29.58 శాతం ఉండిన సిపిఎం నేతృత్వంలోనివామపక్ష కూటమి ఓటింగ్ శాతం ఈ సారి 19.7 శాతానికి పడిపోయింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఆపార్టీకి దాదాపు 23 శాతం ఓట్లు వచ్చాయి. సిపిఎం ఈ సారి 26 స్థానాలను గెలుచుకోగా, ఆ కూటమిలోని భాగస్వామ్య పక్షాలయిన ఆర్‌ఎస్‌పి 3, ఫార్వర్డ్ బ్లాక్ 2, సిపిఐ 1 స్థానాలను గెలుచుకున్నాయి. లెఫ్ట్ ఫ్రంట్‌లోని అన్ని పార్టీలకు కలిసి వచ్చిన ఓట్ల శాతం కూడా 2011 ఎన్నికల్లో వచ్చిన 41 శాతంనుంచి 24 శాతానికి పడిపోయింది. 2011 ఎన్నికల్లో లెఫ్ట్‌ఫ్రంట్ 60 స్థానాలను గెలుచుకోగా, వాటిలో సిపిఎం గెలిచినవి 40 స్థానాలున్నాయి. సిపి ఎం, కాంగ్రెస్ పార్టీలు ఒక్కటి కావడం ఘోర తప్పిదమని, ప్రజలు దాన్ని తిరస్కరించారని మమతా బెనర్జీ వ్యాఖ్యానించడం తెలిసిందే. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ పొత్తువల్ల లాభపడిందనే చెప్పాలి. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేసినప్పుడు ఆ పార్టీకి వచ్చిన ఓట్లు 9.09 శాతం అయితే ఇప్పుడది 12.3 శాతానికి పెరిగిది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో సైతం ఆపార్టీకి వచ్చింది 9.6 శాతం ఓట్లే కావడం గమనార్హం.

పశ్చిమ బెంగాల్ గవర్నర్ కేసరీనాథ్ త్రిపాఠిని
శుక్రవారం కలుసుకున్న ముఖ్యమంత్రి మమతాబెనర్జీ

27న మమత ప్రమాణ స్వీకారం
లెజిస్లేచర్ పార్టీ నేతగా ఎన్నిక
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో కొత్తగా ఎన్నికయిన తృణమూల్ కాణగ్రెస్ శాసన సభ్యులు శుక్రవారం పార్టీ అధినేత్రి మమతా బెనర్జీని లెజిస్లేచర్ పార్టీ నేతగా అధికారికంగా ఎన్నుకున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు లెజిస్లేచర్ పార్టీ సమావేశం జరిగింది. ఆమె ఈ నెల 27న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓ వైపు లెఫ్ట్-కాంగ్రెస్ కూటమిని, మరోవైపు బిజెపిని చిత్తు చేసి తిరుగులేని మెజారిటీతో పార్టీని ఒంటి చేత్తోగెలిపించిన మమత టిఎంసి లెజిస్లేచర్ పార్టీ నేతగా ఎన్ని కావడం లాంఛనమేనన్న విషయం అందరికీ తెలిసిందే.
కాశ్మీర్‌లో మళ్లీ
పాక్ జెండాలు
శ్రీనగర్, మే 20: శ్రీనగర్‌లో హురియత్ కాన్ఫరెన్స్ అధినేత మిర్వేజ్ ఉమర్ ఫరూక్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రదర్శనలో ముసుగులు ధరించిన కొందరు పాకిస్తాన్ జెండాలను ప్రదర్శించారు. వేర్పాటువాద నాయకుడైన మిర్వేజ్ తన తండ్రి మిర్వేజ్ వౌల్వి ఫరూక్ 26వ వర్ధంతిని పురస్కరించుకుని పలు కార్యక్రమాలతో పాటు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ముసుగులు ధరించిన కొందరు పాకిస్తాన్ జెండాలు, పచ్చ జెండాలను ప్రదర్శించారని పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. ఈ జెండాలను ఎవరు ప్రదర్శించారనే దానిపై విచారణ జరుగుతోందని ఆయన తెలిపారు. మిర్వేజ్ వౌల్వి ఫరూక్‌ను 1990 మే 21న ఆయన నివాసంలో ఇద్దరు సాయుధులు కాల్చి చంపారు.