జాతీయ వార్తలు

ఒబామాతో మరో కీలక భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 20: ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే నెల 7నుంచి రెండు రోజుల పాటు అమెరికాలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో ఆయన అమెరికా కాంగ్రెస్ సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించడంతో పాటుగా రక్షణ, భద్రత, ఇంధన తదితర కీలక రంగాల్లో సాధించిన పురోగతిని సమీక్షించడం కోసం అధ్యక్షుడు బరాక్ ఒబామాతో చర్చలు జరుపుతారు. ఆదివారం ఇరాన్ పర్యటనకోసం బయలుదేరి వెళ్తున్న మోదీ వచ్చేనెల 4నుంచి రెండు రోజుల పాటు ఖతార్‌లో కూడా పర్యటిస్తారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆహ్వానంపై మోదీ జూన్ 7-8 తేదీల్లో వాషింగ్టన్ డిసి సందర్శిస్తారని విదేశాంగ శాఖ శుక్రవారం ఇక్కడొక ప్రకటనలో తెలియజేసింది. ప్రధాని పర్యటన ముఖ్య ఉద్దేశం ఆర్థిక, ఇంధన, పర్యావరణం, రక్షణ, భద్రతలాంటి వివిధ రంగాల్లో ఇరు దేశాలు సాధించిన పురోగతిని సమీక్షించడంతో పాటుగా భవిష్యత్తులో ఈ సహకారాన్ని మరింత విస్తృతం చేయడంగా ఉంటుందని కూడా విదేశాంగ శాఖ ఆ ప్రకటనలో తెలిపింది. అమెరికా కాంగ్రెస్‌నుద్దేశించి ప్రసంగించాల్సిందిగా ప్రతినిధుల సభ స్పీకర్ పాల్ రియన్ కూడా ప్రధానిని ఆహ్వానించారని, అందుకు ఆయన అంగీకరించారని కూడా ఆ ప్రకటన తెలిపింది. అణు శిఖరాగ్ర సదస్సులో పాల్గొనడం కోసం మోదీ గత మార్చిలో అమెరికా వెళ్లినప్పుడు ఒబామా ఆయనను అమెరికాలో పర్యటించాల్సిందిగా ఆహ్వానించారు. కాగా, అమెరికా కాంగ్రెస్‌నుద్దేశించి ప్రసంగించబోయే అయిదవ భారత ప్రధాని మోదీ అవుతారు. ఇంతకు ముందు మన్మోహన్ సింగ్, వాజపేయి, పివి నరసింహారావు, రాజీవ్ గాంధీ అమెరికా కాంగ్రెస్ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించారు.