జాతీయ వార్తలు

కాంగ్రెస్ కంచుకోటల్లో ‘కమలం’ పాగా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గౌహతి, మే 20: అసోంలో చరిత్రాత్మక విజయం సాధించిన బిజెపి ఇప్పటివరకు కాంగ్రెస్ కంచుకోటలుగా ఉండిన ఎగువ అసోం, బారక్ వ్యాలీ ప్రాంతాల్లో ఆ పార్టీని తుడిచిపెట్టడంతో పాటు మైనారిటీ ఓటర్లు అత్యధిక సంఖ్యలో ఉండే జిల్లాల్లోకి కూడా చొచ్చుకు పోగలిగింది. కాంగ్రెస్ ఓటు బ్యాంక్‌గా ఉండిన తేయాకు తోటల కార్మికులను విజయవంతంగా తన వైపునకు తిప్పుకోగలిగిన బిజెపి మైనారిటీలు పెద్ద సంఖ్యలో ఉన్న ప్రాంతాల్లోకి సైతం చొచ్చుకు పోగలిగింది. ఎగువ అసోంలో 34 అసెంబ్లీ స్థానాలుండగా, వీటిలో 23 నియోజకవర్గాల్లో తేయాకు తోటల కార్మికులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. గత అసెంబ్లీలో ఈ ప్రాంతంనుంచి రెండు స్థానాలు మాత్రమే గెలుచుకున్న బిజెపి ఇప్పుడు 18 స్థానాల్లో పాగా వేయగలిగింది. గత ఎన్నికల్లో తాను సాధించిన 78 స్థానాల్లో ఎగువ అసోంనుంచే 30 సీట్లు దక్కించుకున్న కాంగ్రెస్ ఈ సారి ఈ ప్రాంతంలో ఆరు చోట్ల మాత్రమే విజయం సాదించింది. మ వైపు, కాంగ్రెస్‌నుంచి నవో బోయిచా స్థానాన్ని గెలుచుకోవడం ద్వారా ఏఐయుడిఎఫ్ అందర్నీ ఆశ్చర్య పరిచింది. కాగా, కాంగ్రెస్‌కు మరో కంచుకోట అయిన బరాక్ వ్యాలీలో 15 అసెంబ్లీ స్థానాలుండగా, గత అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపికి ఇక్కడ ఒక్క సీటు కూడా దక్కలేదు. అయితే ఆ తర్వాత సిల్చార్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో మాత్రం ఆ పార్టీ విజయం సాధించింది. కానీ, ఈ సారి ఎన్నికల్లో బిజెపి ఎనిమిది సీట్లలో విజయం సాధించింది. గత అసెంబ్లీ ఎన్నిల్లో ఈ ప్రాంతంనుంచి 13 సీట్లు సాధించిన కాంగ్రెస్ ఈ సారి మూడు సీట్లను మాత్రమే నిలబెట్టుకోగలిగింది. మరోవైపు గత ఎన్నికల్లో ఒక స్థానం దక్కించుకున్న ఏఐయుడిఎఫ్ ఈ సారి మూడు చోట్ల విజయం సాధించింది. కాగా,దిమా హసావో, కర్బీ ఆంగ్లాంగ్ కొండప్రాంత జిల్లాల్లో అయిదు అసెంబ్లీ నియోజకవర్గాలుండగా గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఈ అయిదు సీట్లను దక్కించుకుంది. అయితే ఈ సారి ఆ పార్టీకి ఒక్కసీటు మాత్రమే దక్కగా మిగతా నాలుగు స్థానాలను బిజెపి కైవసం చేసుకుంది.
మైనారిటీలు అధిక సంఖ్యలో ఉన్న ధుమ్రి, గోపాల్ పారా, బార్‌పేట్ జిల్లాల్లోని 18 స్థానాల్లో బిజెపి నాలుగు స్థానాలు గెలుచుకోగా, దాని మిత్రపక్షమైన ఎజిపి రెండు సీట్లు గెలుచుకుంది.ఈ ప్రాంతంనుంచి 12 స్థానాలు దక్కించుకుని గత అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉండిన ఏఐయుడిఎఫ్ ఈ సారి దాదాపుగా తుడిచిపెట్టుకుపోయింది. ఆ పార్టీకి ఈ సారి మూడు స్థానాలు దక్కినప్పటికీ పార్టీ అధ్యక్షుడు బద్రుద్దీన్ అజ్మల్ సైతం ఓటమి పాలయ్యారు.