జాతీయ వార్తలు

సోనోవాల్ ఎంపిక లాంఛనమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గువహటి, మే 20: అస్సాం బిజెపి లెజిస్టేచర్ పార్టీ నేతగా శర్వానంద సోనోవాల్‌ను ఎన్నికకానున్నారు. ఈనెల 22న బిజెపి శాసన సభ్యులందరూ సమావేశమవుతున్నారు. లెజిస్లేచర్‌పార్టీ నేతగా సోనోవాల్ ఎంపిక లాంఛనమే. ప్రస్తుతం కేంద్ర క్రీడలశాఖ సహాయ మంత్రిగా ఉన్న 53 ఏళ్ల శర్వానంద్ సోనోవాల్ అధ్యక్షతన శుక్రవారం ఇక్కడ బిజెపి శాసన సభ్యులు సమావేశమయ్యారు. బిజెపి రాష్ట్ర కార్యాలయంలో సమావేశం జరిగినట్టు పార్టీ అధికార ప్రతినిధి బిశ్వాశర్మ వెల్లడించారు. అసోం అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపిని గెలిపించడంలో సోనోవాల్ క్రీయాశీలక పాత్ర పోషించారు. ఎజిపి, బోడో పీపుల్స్ పార్టీని కలుపుకొని బిజెపికి తిరుగులేని మెజారిటీని సాధించిపెట్టారు. 1988లో అస్సాం విద్యార్థి సంఘం నాయకుడిగా పనిచేసిన సోనోవాల్ బంగ్లాదేశ్ వలసలపై జరిగిన ఉద్యమాల్లో చురుకైన పాత్ర పోషించారు. ఐదేళ్ల క్రితం బిజెపిలో చేరిన శర్వానంద అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘన విజయానికి వ్యూహరచన చేశారు. ఈనెల 22న జరిగే ఎమ్మెల్యే సమావేశంలో సోనోవాల్‌ను లెజస్లేచర్ పార్టీ నేతగా ఎన్నుకుంటారని బిశ్వాశర్మ స్పష్టం చేశారు. మర్నాడు అంటే 23న బిజెపి మిత్రపక్షాలైన ఎజిపి,బిపిఎఫ్‌లు సమావేశమై సోనోవాల్‌ను సభానాయకుడిగా ఎన్నుకుంటారు. 24న కొత్త ప్రభుత్వం ప్రమాణస్వీకారం చేస్తుందని ఆయన వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ, బిజెపి అధ్యక్షుడు అమిత్‌షా, ఎన్‌డిఏ సిఎంలు అందరూ హాజరవుతారని తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటు ముందే సోనోవాల్ ప్రధాని మోదీతో భేటీ అవుతారు.

గౌహతిలో శుక్రవారం జరిగిన బిజెపి శాసన సభాపక్షనేత సమావేశంలో ముఖ్యమంత్రి అభ్యర్థి సోనోవాల్, బిజెపి సీనియర్ నేతలు రామ్ మాధవ్, మహేంద్ర సింగ్ తదితరులు