జాతీయ వార్తలు

కేరళ ముఖ్యమంత్రిగా విజయన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరువనంతపురం, మే 20: ముఖ్యమంత్రి పదవిపై ఎన్నో ఆశలుపెట్టుకున్న 93ఏళ్ల అచ్యుతానందన్‌కు నిరా శే ఎదురైంది. సిపిఎం పోలిట్‌బ్యూరో సభ్యుడు పినరాయి విజయన్ కేరళ సిఎం కానున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్‌డిఎఫ్‌కు తిరుగులేని మెజారిటీ వచ్చింది. సిపిఎం కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఉదయం జరిగిన పార్టీ కార్యదర్శివర్గ సమావేశంలో విజయన్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎంపిక చేశారు. ముఖ్యమంత్రి పదవి రేసులో ఉన్న 93 ఏళ్ల అచ్యుతానందన్‌కు అవకాశం దక్కలేదు. కాబోయే ముఖ్యమంత్రిగా పినరాయి విజయన్ పేరును పార్టీ కార్యదర్శి వర్గం ఏకగ్రీవంగా ఎంపిక చేసింది. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఏకైక పోలిట్‌బ్యూరో సభ్యుడు విజయన్. 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో సిపిఎం నాయకత్వంలోని ఎల్‌డిఎఫ్ 91 సీట్లు గెలుచుకుంది. బిజెపి, ఇండిపెండెంట్ చెరో స్థానాన్ని దక్కించుకున్నారు. సిఎంగా విజయన్‌ను ఎంపిక చేయడంతో పార్టీలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. రాష్ట్ర పార్టీ ఆఫీసు ఎకెజి భవన్ వద్ద కార్యకర్తలు స్వీట్లు పంచుకునిన సంబరాల్లో మునిగిపోయారు. కేరళ రాజకీయాల్లో బలమైన తియ్యా సామాజిక వర్గానికి చెందిన విజయన్ ‘పినరాయి’గా సుపరిచితులు. 16 ఏళ్ల పాటు పార్టీని ఒకే తాటిపైనడిపిన విజయన్ గత ఏడాదే రాష్ట్ర కార్యదర్శి పదవి నుంచి తప్పుకున్నారు. పినరాయి 1996-88 మధ్య విద్యుత్ శాఖా మంత్రిగా పనిచేసినప్పుడు అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. మూడు హైడల్ పవర్ ప్రాజెక్కుల ఆధునీకరణ సందర్భంగా అవకతవకలకు పాల్పడినట్టు ప్రత్యర్థులు ఆరోపించారు. ఇలా ఉండగా సిపిఎం నేతలు ప్రకాశ్‌కారత్, సీతారామ్ ఏచూరి సమక్షంలో జరిగిన సమావేశం నుంచి సీనియర్ నేత అచ్యుతానందన్ మధ్యలోనే వెళ్లిపోయినట్టు తెలిసింది. ఎల్‌డిఎఫ్ విజయంలో కీలక భూమిక పోషించిన ఆయనను కాదని విజయన్‌ను ఎంపిక చేయడం పార్టీలో ముసలం తప్పదని అంటున్నారు.

కేరళ సిఎంగా ఎన్నికకానున్న విజయన్‌తో సిపిఎం సీనియర్‌నేత ప్రకాష్‌కారత్