జాతీయ వార్తలు

లంకలో 200 మంది జలసమాధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలంబో, మే 18: భారీ వర్షాలు, వరదలు శ్రీలంకలో ప్రళయాన్ని సృష్టించాయి. వర్ష బీభత్సానికి కొండ చరియలు విరిగిపడి 200 మంది జలసమాధి అయ్యారు. మూడు రోజుల నుంచి ఎడతెరిపిలేని వర్షాలు లంకను అతలాకుతలం చేశాయి. 40 మంది వరకూ మృతి చెందారని అధికారులు వెల్లడించారు. శిథిలాల నుంచి 17 మృతదేహాలను వెలికితీసినట్టు తెలిపారు. మట్టిపెళ్ల కింద కూరుకుపోయి చనిపోయిన వారి సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉండొచ్చని భయపడుతున్నారు. ఈశాన్య లంకలోని కెగల్లీ ప్రాంతంలో రెండు గ్రామాలు నామరూపాల్లేకుండా పోయాయి. మట్టి ఇళ్లను పూర్తిగా కప్పేసింది. ఇది పర్వత ప్రాంతం కావడంతో అపార నష్టం వాటిల్లిందని సైనిక ప్రతినిధి బ్రిగేడియర్ జయంత్ జయవీర వెల్లడించారు. మూడు రోజుల వర్షాలకు 36 మంది చనిపోయినట్టు ఆయన తెలిపారు. ఏకంగా 81,216 కుటుంబాలకు చెందిన 3లక్షల 32వేల 254 మంది నిరాశ్రయిలయ్యారు. 300 మంది సైనికులు సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. అరణ్యకే గ్రామంలో కొండచరియల కింద చిక్కుకున్న 180 మందిని రక్షించించినట్టు సైనిక ప్రతినిధి తెలిపారు. అదే ప్రాంతంలో 13 మృతదేహాలు వెలికితీశామన్నారు. సహాయ శిబిరాల్లో 1,041 మంది తలదాచుకుంటున్నట్టు షా ఫాజిల్ అనే అధికారి మీడియాకు తెలిపారు. బులాత్‌కొహుపితియా గ్రామంలో నాలుగు మృతదేహాలు కనుగొన్నట్టు ఆయన చెప్పారు. సిరిపుర, పల్లేబగే, ఇలాగిపితియా గ్రామాల్లో భారీ ప్రాణనష్టం వాటిల్లిందని లంక రెడ్‌క్రాస్ సంస్థ ప్రకటించింది. కనీసం 150 గ్రామస్థుల ఆచూకీ తెలియకుండా పోయింది. ప్రాణ నష్టం ఎక్కువగానే ఉంటున్నన ఆందోళన వ్యక్తం చేశారు. కొండలపై వస్తున్న వర్షం నీళ్లు పల్లపు ప్రాంతాలను ముంచేశాయి. ఎక్కడికక్కడ కూలిపోయిన ఇళ్లు, కొండ చరియలు, బురద నీళ్లు కనిపిస్తున్నాయి. వందలాది ఇళ్లను మట్టికప్పేసిన దృశ్యాలు స్థానిక టివి చానళ్లలో ప్రసారం చేశారు. కేగల్ల గ్రామంలో 66 ఇళ్లను కొండ చరియలు కప్పేశాయి. లంక రాజధాని కొలంబోలోనూ వరదలు ముంచెత్తాయి. విద్యాసంస్థలన్నింటికీ సెలవులు ప్రకటించారు. 22 జిల్లాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. చాలా చోట్ల 200 మిల్లీమీటర్ల వర్షం కురిసిందని అధికారులు తెలిపారు.

కొలంబోలో నీటమునిగిన ప్రాంతంలో ప్రజల ఎదురీత