జాతీయ వార్తలు

మొబైల్ యాప్‌లో ఐఐటి పాఠాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 18: ప్రతిష్ఠాత్మక జాతీ య స్థాయి విద్యాసంస్థలయిన ఐఐటిలలో తమ పిల్లలను చదివించాలన్న తల్లిదండ్రుల ఆశలను, విద్యార్థుల ఆకాంక్షలను సొమ్ము చేసుకుంటున్న కోచింగ్ సెంటర్ల దోపిడీని అడ్డుకోవడానికి, ఈ కోచింగ్ జాడ్యాన్ని నిరోధించడానికి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ (హెచ్‌ఆర్‌డి) నడుంబిగించింది. ఇందుకోసం వివిధ సబ్జెక్టులపై ఐఐటి ఫాకల్టీ సభ్యులు ఇచ్చిన ఉపన్యాసాలు, ఐఐటి ఎంట్రన్స్ టెస్టుల పాత ప్రశ్నపత్రాలతో కూడిన మొబైల్ యా ప్‌ను, పోర్టల్‌ను తీసుకురావడానికి రం గం సిద్ధం చేసింది. వీటిని విద్యార్థులకు ఉచితంగా అందుబాటులో ఉంచనుంది. కేంద్ర హెచ్‌ఆర్‌డి మంత్రి స్మృతి ఇరానీ బుధవారం ఇక్కడ ఈ విషయం చెప్పా రు. ఐఐటి-జెఇఇ ప్రవేశ పరీక్షలో ఇచ్చే ప్రశ్నలు 12వ తరగతి పాఠ్యాంశాలకు లోబడి ఉండాలని కూడా నిర్ణయించినట్లు ఆమె వెల్లడించారు. ప్రైవేటు డీమ్డ్ యూనివర్శిటీలతో కూడిన ఎడ్యుకేషన్ ప్రైవేట్ సొసైటీ ఫర్ ఇండియా (ఇపిఎస్‌ఎఫ్‌ఐ) నిర్వహించిన ఒక కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ ఈ సంస్థలు ఎదుర్కొంటున్న వివిధ నియంత్రణ అంశాలను పరిష్కరించడానికి తమ మంత్రిత్వ శాఖ కట్టుబడి ఉందని తెలిపారు. విద్య వ్యాపారమయం కావడం పట్ల ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. కోచింగ్ పరిశ్రమ జాడ్యాన్ని ఈ సందర్భంగా మంత్రి ప్రస్తావిస్తూ ఐఐటి ప్రవేశ పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థులపై తీవ్రమైన ఒత్తిడి ఉంటోందని పేర్కొన్నారు. అందువల్ల విద్యార్థులకు సహకరించడానికి రానున్న రెండు నెలల్లో ఐఐటి-పాల్ పోర్టల్‌ను, మొబైల్ యాప్‌ను తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆమె తెలిపారు. వీటిలో గత 50 సంవత్సరాలలో ఐఐటి ప్రవేశ పరీక్షలో ఇచ్చిన ప్రశ్న పత్రాలు విద్యార్థులకు ఉచితంగా అందుబాటులో ఉంటాయని ఆమె వివరించారు. ఐఐటి విద్యావేత్తలు, ఫాకల్టీ సభ్యులు వివిధ సబ్జెక్టుల్లోని పాఠ్యాంశాలపై ఇచ్చిన ఉపన్యాసాలు కూడా వీటిలో ఉంటాయని చెప్పారు. ప్రాంతీయ భాషల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని ఈ అంశాలను 13 భాషల్లో అందుబాటులో ఉంచుతున్నట్లు మంత్రి వివరించారు. విద్య వ్యాపారమయం అవుతుండటాన్ని అడ్డుకోవలసిన అవసరం కూడా ఉందని స్మృతి ఇరానీ అన్నారు. విద్యారంగానికి చెడ్డ పేరు తెస్తున్న నకిలీ విశ్వవిద్యాలయాల ఆటకట్టించడానికి పాలనాధికారులకు సహకరించాలని ఆమె ఇపిఎస్‌ఎఫ్‌ఐని కోరారు.

మంత్రి స్మృతి ఇరానీ

అభివృద్ధే మా అజెండా
వీధుల పేర్ల మార్పుపై వెంకయ్య
న్యూఢిల్లీ, మే 18: సంస్థలకు, వీధులకు ఉన్న పేర్లు మార్చాలన్న డిమాండ్‌పై కేంద్రం స్పందించింది. ఉన్న పేర్లు మార్చి కొత్త నామకరణాలు చేయడం తమ అజెండా కాదని కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి ఎం వెంకయ్య నాయుడు వెల్లడించారు. ఢిల్లీలోని అక్బర్ రోడ్డు పేరును మార్చాలంటూ కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి వికె సింగ్ చేసిన విజ్ఞప్తిపై కేంద్రం ఈ మేరకు స్పందించింది. అక్బర్ రోడ్డు పేరును మహారాణా ప్రతాప్ పేరుగా మార్చాలంటూ సింగ్ కేంద్రానికి లేఖ రాశారు. అభిప్రాయం వ్యక్తం చేసే స్వేచ్ఛ అందరికీ ఉంటుందన్న మంత్రి ‘దేశ ప్రయోజనాలు, సమస్యల పరిష్కారం, అభివృద్ధే ప్రభుత్వం అజెండా. వాటి కోసమే పనిచేస్తుంది’ అని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ పిలుపు మార్గదర్శకత్వంలో అభివృద్ధే తమ అజెండా అని బిజెపి కార్యదర్శి శ్రీకాంత్ శర్మ చెప్పారు. కాగా గత ఏడాది ఆగస్టులో ఢిల్లీ ఔరంగబాద్ రోడ్డును దివంగత మాజీ రాష్టప్రతి అబ్దుల్ కలామ్ పేరుగా మార్చిన సంగతి తెలిసిందే.