జాతీయ వార్తలు

అది తప్పుదోవ పట్టించే నివేదిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 18: ప్రపంచంలోని అత్యంత ఎక్కువ కాలుష్యం గల వంద నగరాలలో 30కి పైగా నగరాలు భారతదేశంలో ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డ బ్ల్యుహెచ్‌ఒ) విడుదల చేసిన తాజా నివేదిక ప్రజలను త ప్పుదారి పట్టించేదిగా ఉందని కేంద్ర పర్యావరణ మంత్రి ప్రకాశ్ జావడేకర్ అన్నారు. అమెరికా, యూరప్‌లోని ప్రధాన దేశాలలో వాయు కాలుష్య గణాంకాలను భారత్ త్వరలో ప్రపంచం ముందు ఉంచుతుందని ఆయన వెల్లడించారు. డబ్ల్యుహెచ్‌ఒ గాలి నాణ్యతను నిర్ణయించే ప్రక్రియలో కీలక కాలుష్య కారకాలయిన సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజెన్ డయాక్సైడ్, బెంజిన్‌లను పరిగణనలోకి తీసుకోలేదని ఆయన పేర్కొన్నారు. పశ్చిమ దేశాలు తమ నగరాలలోని కాలుష్యాన్ని పట్టించుకోకుండా భారత్, మరికొన్ని దేశాలపై ఎందుకు కేంద్రీకరిస్తున్నాయని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 2012-13 సంవత్సరాలలో సేకరించిన గణాంకాల ఆధారంగా డబ్ల్యుహెచ్‌ఒ నివేదిక రూపొందింది. గాలిలోని నిర్దిష్ట పదార్థం (పర్టికులర్ మ్యాటర్) పిఎం 10- పిఎం 2.5ను పరిగణనలోకి తీసుకొని ఈ నివేదిక తయారు చేశారు. ఈ నివేదిక ప్రకారం ప్రపంచంలోని అత్యంత ఎక్కువ కాలుష్యం గల నగరాలలో ఢిల్లీ 11వ స్థానంలో నిలిచింది. అయితే డబ్ల్యుహెచ్‌ఒ నివేదిక వాస్తవ పరిస్థితిని ప్రతిబింబించలేదని పర్యావరణవేత్తలు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో కేవలం పిఎం 2.5 ఆధారంగా నగరాల కాలుష్య స్థాయిని లెక్కించడం తప్పుదారి పట్టించడమే అవుతుందని మంత్రి ప్రకాశ్ జావడేకర్ బుధవారం ఒక వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. తాము డబ్ల్యుహెచ్‌ఒ నివేదికను తిప్పికొట్టడానికి ఇతర దేశాలలోని నగరాల కాలుష్యాన్ని వెల్లడించడం లేదని, ప్రజలను చైతన్యం చేయడానికే దీనికి పూనుకున్నామని మంత్రి వివరించారు.
ఎస్సీ వర్గీకరణకు చొరవ తీసుకోండి
వెంకయ్య నాయుడికి మంద కృష్ణ మాదిగ విజ్ఞప్తి
ఆంధ్రభూమి ప్రతినిధి
న్యూఢిల్లీ, మే 18: ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధతకు చొరవ తీసుకోవాలని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుకు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా విజ్ఞప్తి చేశారు. మాదిగలు, మాదిగ ఉపకులాలు కోల్పోయిన హక్కుల సాధనకు సాగిస్తున్న పోరాటానికి వెంకయ్య నాయుడు సంపూర్ణ సహకారాలు అందించారని ఆయన విలేఖరులకు తెలిపారు. ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధతకోసం గత యూపిఏ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు పార్టీ పెద్దల చేత, ఎన్డీయే పక్షాలతో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్‌కు వెంకయ్య లేఖలు రాయించారని ఆయన గుర్తుచేశారు. బిజెపి ఇచ్చిన హామీ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి వర్గీకరణ అంశం వివరించి, బిల్లు ను పార్లమెంట్‌లో పెట్టడానికి సహకారం అందించాలని వెంకయ్యకు విజ్ఞాపన పత్రం అందచేశారు.