జాతీయ వార్తలు

కేంద్రంతో మళ్లీ కయ్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 18: ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆప్ ప్రభుత్వం మరోసారి కేంద్రంపై ఘర్షణకు తలపడబోతోంది. ఢిల్లీకి రాష్టప్రతి ప్రతిపత్తి ఇవ్వాలన్న డిమాం డ్ కేజ్రీవాల్ మళ్లీ తెరమీదకు తీసుకొస్తున్నారు. పోలీసు, భూములు, అధికార యంత్రాంగాన్ని రాష్ట్ర పరిధిలోకి తీసుకురావలన్న డిమాండ్ ఆప్ ప్రభుత్వం ఓ ముసాయిదా బిల్లు రూ పొందించింది. బిల్లుపై ప్రజాభిప్రాయాన్ని కోరింది.
జూన్ 30లోగా సూచనలు, సలహాలు ఇవ్వాల్సిందిగా ప్రజలను ఆప్ ప్రభుత్వం ఆహ్వానించింది. ఇదే అంశంపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కేజ్రీవాల్ ప్రభుత్వం నిర్ణయించింది. అఖిలపక్ష సమావేశానికి హాజరుకావల్సిందిగా రాజకీయ ప్రత్యర్థులు కాంగ్రెస్, బిజెపిలను ఆమ్‌ఆద్మీ పార్టీ ఆహ్వానించనుంది. ఢిల్లీకి రాష్ట్ర ప్రతిపత్తి కల్పిస్తామని బిజెపి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని ఈ సందర్భంగా కేజ్రీవాల్ ప్రభుత్వం గుర్తుచేస్తోంది. రాష్టప్రతిపై తమ ప్రభుత్వం రూపొందించిన ముసాయిదా బిల్లుపై ప్రజల సూచనలు, సలహాలు తీసుకుంటామని బుధవారం ఇక్కడ విలేఖరుతో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ చెప్పారు. ‘ముసాయిదా బిల్లును కేంద్రం తిరస్కరిస్తే మీ కార్యాచరణ ఏమిటని’ మీడియా ప్రశ్నించగా దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ, హోమ్‌మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బిజెపి అధ్యక్షుడు అమిత్‌షా, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీలకు లేఖలు రాయనున్నట్టు స్పష్టం చేశారు. బిల్లుకు మద్దతు ఇవ్వాల్సిందింగా వారందరిని అభ్యర్థిస్తామని కేజ్రీవాల్ పేర్కొన్నారు. జూన్ 30 నాటికి ప్రజల నుంచి వచ్చిన సలహాలు, సూచనలు పరిగణనలోకి తీసుకున్న తరువాత తుది బిల్లు ఖరారు చేస్తామని ఆయన వెల్లడించారు. తరువాత ఢిల్లీ అసెంబ్లీలో బిల్లు తీసుకొస్తామని ఆయన తెలిపారు. ముసాయిదా బిల్లును డిల్లీ ప్రభుత్వం వెబ్‌సైట్‌లోనూ అందుబాటులో ఉంచుతామని కేజ్రీవాల్ ప్రకటించారు. బిల్లులో సవరణలకు అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరిచే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. బిజెపి మేనిఫెస్టోలో ఢిల్లీకి రాష్ట్ర ప్రతిపత్తి కల్పిస్తామన్న హామీ ఇచ్చారని, కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు సహా పరువురు నేతలు అదే అంశాన్ని పలు ఎన్నికల సభల్లో ప్రస్తావించిన విషయాన్ని కేజ్రీవాల్ గుర్తుచేశారు. బిజెపి సీనియర్ నేత ఎల్‌కె అద్వానీ 2003లో ఢిల్లీ రాష్ట్రప్రతిపత్తి బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టారని ఆయన అన్నారు.
అప్పట్లో ప్రణబ్ ముఖర్జీ అధ్యతన ఉన్న పార్లమెంటు స్థారుూ సంఘం పరిశీలనకు పంపారని ఢిల్లీ సిఎం తెలిపారు. అయితే కొన్ని కారణాలవల్ల బిల్లు వీగిపోయిందన్న కేజ్రీవాల్ కాంగ్రెస్ నేతలూ అనేక సందర్భాల్లో ఢిల్లీకి రాష్ట్ర ప్రతిపత్తిపై మాట్లాడిన విషయాన్ని మీడియా ముందు గుర్తుచేశారు. ‘కిరణ్ రిజిజు 2006లో రాష్ట్ర ప్రతిపత్తిపై మాట్లాడారు. 2011లో వికె మల్హోత్రా ఇది అంశాన్ని లేవనెత్తారు. 2014 మే 25న హర్షవర్ధన్ కూడా ఢిల్లీ రాష్ట్ర ప్రతిపత్తి అంశాన్ని ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్తామని అన్నారు’ అని కేజ్రీవాల్ స్పష్టం చేశారు.

కాంగ్రెస్, బిజెపి ఎన్నికల మేనిఫెస్టోలను
చూపుతున్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్