జాతీయ వార్తలు

దేనికైనా ‘గాంధీ’ల పేరేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబై, మే 18: దేశంలోని అన్ని ప్రధానమైన ప్రభుత్వ ఆస్తులన్నింటికీ ‘గాంధీ’ల కుటుంబీకుల పేర్లే ఎందుకు పెట్టాలని ప్రముఖ బాలీవుడ్ నటుడు రిషి కపూర్ తీవ్రంగా స్పందించారు. బుధవారం తన ట్విట్టర్ అకౌంట్‌లో వరుస ట్వీట్‌లతో కాంగ్రెస్ పరిపాలన కాలంలో ‘గాంధీ’ కుటుంబీకుల పేర్లను ప్రతీ వ్యవస్థకు పెట్టడాన్ని విమర్శించారు. అసహనం వంటి అంశాలలో కాషాయ సంస్థల తీరుపై గతంలో విరుచుకుపడ్డ రిషి కపూర్ ఈసారి గాంధీల కుటుంబీకుల పేర్లపై ఆరోపణలు చేశారు. ‘‘వివిధ సంస్థలు, ఆస్తులకు ‘గాంధీ’ కుటుంబ పేర్లను తొలగించాలి. బాంద్రా/వర్లీ సముద్ర లింక్‌రోడ్‌కు లతామంగేష్కర్ పేరో, లేక జేఆర్డీ టాటా లింక్ రోడ్ అనో పెట్టండి. ఇదేమన్న మీ తండ్రి సంపాదించిన ఆస్తనుకుంటున్నారా?’ అని విమర్శించారు. ‘ముంబైలోని ఫిల్మ్‌సిటీకి దిలిప్ కుమార్, దేవ్ ఆనంద్, అశోక్ కుమార్ లేక అమితాబ్ బచ్చన్‌ల పేర్లు పెట్టవచ్చు. రాజీవ్‌గాంధీ పేరుకు దీనికి సంబంధం ఏమిటి? అంతే కాదు.. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఇందిరాగాంధీ పేరేనా? మహాత్మాగాంధీ లేక భగత్‌సింగ్ లేక అంబేద్కర్ పేరో పెట్టలేరా? ఎవరూ కాకపోతే నాపేరే ‘రిషికపూర్’ విమానాశ్రయమంటూ పెట్టవచ్చు. నా తండ్రి రాజ్‌కపూర్ ఈ దేశానికి ఎంతో సేవ చేశారు’ అని ట్వీట్ చేశారు. రిషి కపూర్ ట్వీట్లపై మరోనటుడు అనుపమ్ ఖేర్ స్పందించారు. ‘రిషికపూర్ ఆలోచించినట్లే చాలామంది ఆలోచిస్తున్నారు. ఇది న్యాయమైన ఆలోచనే’ అని ఖేర్ అన్నారు.