జాతీయ వార్తలు

రెండ్రోజుల్లో.. నీట్‌పై నిర్ణయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 18: దేశ వ్యాప్తంగా వైద్య కళాశాలల్లో నీట్ అమలుకు సంబంధించి ఒకటి రెండు రోజుల్లో కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని ప్రకటించబోతోంది.సుప్రీం కోర్టు అదేశించినట్టుగా ఇప్పటికిప్పుడే నీట్‌ను అమలు చేయలేమని అనేక రాష్ట్రాలు స్పష్టం చేసిన నేపథ్యంలో ఏ విధంగా ముందుకు వెళ్లాలన్న దానిపై కేంద్రం న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతోంది. నీట్ తొలి దశ పరీక్ష పూర్తయిందని, రెండో దశ పరీక్ష కూడా జరుగుతుందని వెల్లడించిన కేంద్ర ఆర్థిక మంత్రి జెపి నడ్డా ‘రాష్ట్రాల అభ్యంతరాలను సమగ్రంగా పరిశీలించి రెండు రోజుల్లోనే నిర్ణయం తీసుకుంటాం’అని తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న పరీక్షలు, పాఠ్యాంశాలు, భాష తదితర విషయాలన్నింటిపైనా దృష్టి పెట్టి ‘నీట్’ సమస్యలకు పరిష్కారం కనుగొనాల్సి ఉంటుందని తెలిపారు. సరైన మార్గంలోనే తాము ముందుకు వెళుతున్నామని స్పష్టం చేసిన నడ్డా న్యాయ నిపుణులను సంప్రదించిన మీదటే ఓ నిర్ణయానికి వస్తామన్నారు. అవినీటి, అక్రమాలను నిరోధించాలన్న ఉద్దేశంతోనే వైద్య, డెంటల్ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం నీట్ విధానాన్ని తీసుకురావడం జరిగిందన్నారు. నీట్ అమలును ఏడాది వాయిదా వేస్తూ కేంద్రం ఓ ఆర్డినెన్స్‌ను తీసుకురాబోతోందన్న కథనాల నేపథ్యంలో రెండు రోజుల్లోనే తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామని కేంద్రం వెల్లడించడం గమనార్హం.