జాతీయ వార్తలు

విజేతలెవరు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 18: దేశ వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేకెత్తిస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. తమిళనాడులో జయలలిత రెండో సారి అధికారం లోకి రావడం కష్టమని, డిఎంకెదే అధికారమంటూ వచ్చిన సర్వేలు, పశ్చిమ బెంగాల్‌లో మళ్లీ మమతకే పట్టమని, అసోం లో తొలిసారిగా బిజెపి అధికారంలోకి రాబోతోందంటూ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెలువడిన నేపథ్యంలో వాస్తవ ఫలితాలు ఎలా ఉంటాయన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. తమిళనాడు, పశ్చిమబెంగాల్, కేరళ, అసోం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం ఉదయం 8గంటలకు మొదలవుతుంది. గంటలోగానే ఫలితాల సరళి స్పష్టమవుతుందని, మధ్యాహ్నం పనె్నం డు గంటలకల్లా విజేతలెవరో దాదాపుగా తేలిపోతుందని, మూడు గంటల కల్లా ఐదు రాష్ట్రాల ఫలితాలు పూర్తిగా వెల్లడవుతాయని ఎన్నికల కమిషన్ వర్గాలు తెలిపాయి. అసోం, తమిళనాడు, కేరళ ప్రజలు మార్పుకే ఓటు వేశారని, అసోంలో తొలి సారిగా బిజెపి అధికారంలోకి రాబోతోందంటూ బలమైన అంచనాలే వ్యక్తమయ్యాయి. పుదుచ్చేరిలో డిఎంకెతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉండటమే కాంగ్రెస్‌కు ఉపశమనంగా చెబుతున్నారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు జరిగిన అరగంట తర్వాత ఈవీఎమ్‌లలో నమోదైన ఓట్ల లెక్కింపు మొదలు అవుతుంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు బిజెపిలో కొత్త ఆశలు రేకెత్తించాయి. కాంగ్రెస్‌లో మరింత నిరాశామయ పరిస్థితికే కారణ మయ్యాయి. తమిళనాటు జయలలిత నెగ్గుకొస్తారా లేక ఎగ్జిట్ అంచనాల ప్రకారం డిఎంకె పగ్గాలు చేపడుతుందా అన్నది వేచి చూడాల్సిందే.