జాతీయ వార్తలు

కేంద్ర మంత్రివర్గంలో మార్పులు చేర్పులు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 18: కేంద్ర మంత్రివర్గాన్ని త్వరలోనే పునర్ వ్యవస్థీకరించనున్నట్లు తెలుస్తోంది. గురువారం నాడు ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు చేస్తారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అసోంలో బిజెపి విజయం సాధిస్తే పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి సర్బానంద సోనోవాల్ కేంద్ర మంత్రివర్గం నుంచి తప్పుకోవలసి ఉంటుంది. సర్బానంద సోనోవాల్ ప్రస్తుతం యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రిగా పని చేస్తున్నారు. ఆయన రాజీనామాతో ఏర్పడే ఖాళీని భర్తీ చేయవలసి ఉంటుంది. ఆయనతోపాటు మరికొందరికి కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పించే అవకాశాలు లేకపోలేదని బిజెపి వర్గాలు చెబుతున్నాయి. నరేంద్ర మోదీ కేంద్ర మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు చేసే సమయంలో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను కూడా దృష్టిలో పెట్టుకుంటారని వారంటున్నారు. వచ్చే ఏడాది జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలంటే ఎన్నికల నిర్వహణ, ఇతర కార్యక్రమాలకోసం గట్టి నాయకులను రంగంలోకి దించాలనుకుంటున్నారనీ, అందుకే ఆయన ఆరోగ్య శాఖ మంత్రి జె.డి.నడ్డా, పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్, చిన్న తరహా పరిశ్రమల శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్, వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌లను మంత్రివర్గం నుంచి తొలగించి పార్టీలోకి తీసుకుంటారనే మాట వినిపిస్తోంది. అలాగే ఒకరిద్దరు సీనియర్లతోపాటు కొందరు జూనియర్ మంత్రులకు కూడా ఉద్వాసన పలకవచ్చునని అంటున్నారు.