జాతీయ వార్తలు

యుపిఏ హయాంలో ఖజానా ఖాళీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దాహోద్ (గుజరాత్), మే 15: యుపిఏ ప్రభుత్వ పదేళ్ల పాలన తరువాత ఖాళీ ఖజానా వారసత్వంగా ఎన్‌డిఏ సర్కారుకు అందిందని, దీంతో తమ ప్రభుత్వానికి పేదలను ఆదుకోవడానికి సంబంధించిన పనులు చేయడం సాధ్యం కావడం లేదని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. ‘ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన’ రెండో దశను ఆదివారం ఇక్కడ ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్థికంగా బాగా స్థిరపడిన వారు తమ ఎల్‌పిజి సబ్సిడీని వదలుకోవాలని పిలుపునిచ్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఆనాడు దేశంలో ఆహార కొరతను ఎదుర్కోవడానికి ఒక భోజనాన్ని స్వచ్ఛందంగా వదలుకోవాలని పిలుపునిచ్చిన మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్ర్తీతో పోల్చారు.
‘ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన’ ప్రయోజనాలను అమిత్ షా ప్రజలకు వివరించారు. ఈ పథకంకన్నా ఎక్కువగా మరే పథకం కూడా మహిళా సాధికారతను అందించలేదని ఆయన పేర్కొన్నారు. ఈ పథకం కింద ఆరు కోట్ల మంది మహిళలు గ్యాస్ కనెక్షన్లు పొందుతారని పేర్కొంటూ, మహిళా సాధికారతకు, పేదరిక నిర్మూలనకు ఇదో మంచి ఉదాహరణ అని ఆయన అన్నారు. కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ముఖ్యమంత్రులు ఆనందిబెన్ పటేల్ (గుజరాత్), వసుంధర రాజే (రాజస్థాన్), శివరాజ్ సింగ్ చౌహాన్ (మధ్యప్రదేశ్) ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మధ్యప్రదేశ్‌లోని ఝాబువా, రాజస్థాన్‌లోని ప్రతాప్‌నగర్, దుంగార్‌పూర్, గుజరాత్‌లోని దాహోద్, పంచ్‌మహల్‌కు చెందిన గిరిజన లబ్ధిదారులు ఈ సందర్భంగా ఎల్‌పిజి కనెక్షన్లను అందుకున్నారు. ఈ పథకం కింద మూడేళ్లలో అయిదు కోట్ల కుటుంబాలు ఎల్‌పిజి కనెక్షన్లు పొందుతాయని కేంద్ర మంత్రి ప్రధాన్ తెలిపారు. ఇందుకోసం రూ.8వేల కోట్లు వ్యయం చేస్తున్నట్లు చెప్పారు.
chitram....
‘ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన’లో భాగంగా ఆదివారం దాహోద్‌లో జరిగిన కార్యక్రమంలో లబ్ధిదారులకు గ్యాస్ కనెక్షన్ అందిస్తున్న రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజె. చిత్రంలో గుజరాత్ ముఖ్యమంత్రి ఆనంది బెన్ పటేల్, బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా