జాతీయ వార్తలు

హైస్పీడ్ రైళ్లను పరీక్షించేందుకు రాయ్‌పూర్‌లో టెస్ట్ ట్రాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 15: దేశంలో హైస్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టాలని యోచిస్తున్న భారత రైల్వే వాటితో పాటు కొత్తగా ప్రవేశపెట్టే కొన్ని సాధారణ రైళ్లను పరీక్షించేందుకు రాయ్‌పూర్ వద్ద అత్యాధునిక లేబొరేటరీతో 20 కిలోమీటర్ల పొడవైన టెస్టు ట్రాక్‌ను ఏర్పాటు చేస్తోంది. కొత్త లోకోమోటివ్‌లు (ఇంజన్లు), కోచ్‌లతో పాటు హై యాక్సిల్ లోడ్ వ్యాగన్లను పరీక్షించేందుకు ఈ టెస్టు ట్రాక్‌ను ఉపయోగిస్తారు. ప్రస్తుతం కొత్త రైళ్లను పరీక్షించేందుకు ఇప్పటికే ఉన్న రైలు మార్గాలను ఉపయోగిస్తుండటంతో ట్రాఫిక్‌లో జాప్యం తలెత్తుతోందని, అంతేకాకుండా ఆధునిక అవసరాలకు తగ్గట్టు అన్ని పరీక్షలు నిర్వహించేందుకు ఈ మార్గాలు అనువుగా లేవని రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అమెరికా, జపాన్, దక్షిణ కొరియాసహా వివిధ దేశాల్లో కొత్త రైళ్ల ట్రయల్ రన్‌లను నిర్వహించేందుకు టెస్టు ట్రాక్‌లను ఉపయోగిస్తున్నారని వివరించారు. ఆధునిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని దాదాపు 100 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో రాయ్‌పూర్ వద్ద 5 కిలోమీటర్ల పొడవైన లూప్‌లైను సహా 20 కిలోమీటర్ల టెస్టు ట్రాక్‌ను ఏర్పాటు చేయడం జరుగుతోందని ఆ అధికారి తెలిపారు.

తొగాడియా బంధువు సహా సూరత్‌లో ముగ్గురి హత్య
సూరత్, మే 15: గుజరాత్‌లో కొందరు దుండగులు శనివారం రాత్రి సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రతిపక్ష నేత సోదరుడు సహా ముగ్గురు వ్యక్తులను కత్తులతో పొడిచి చంపారు. అశ్వినీకుమార్ రోడ్డులో జరిగిన ఈ దాడిలో విహెచ్‌పి నేత ప్రవీణ్ తొగాడియా బంధువు భరత్ తొగాడియాతోపాటు బాలూ హరిణి, అశోక్ పటేల్ మరణించగా, దినేష్ అనే మరో వ్యక్తి గాయపడ్డాడని నగర డిసిపి జగదీష్ పటేల్ తెలిపారు. భూమి కొనుగోలు వ్యవహారానికి సంబంధించిన బలవంతపు వసూళ్లే ఈ హత్యలకు కారణమని అనుమానిస్తున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.