జాతీయ వార్తలు

రాష్టప్రతి పాలన ఎత్తివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 11: రాజ్యాంగ సంక్షోభం నేపథ్యంలో ఉత్తరాఖండ్‌లో విధించిన రాష్టప్రతి పాలనను ఎత్తివేయాలని కేంద్ర కేబినెట్ బుధవారం సిఫార్సు చేసింది. ఉత్తరాఖండ్ అసెంబ్లీలో జరిగిన బలపరీక్షలో రావత్ సర్కార్ విజయానికి సుప్రీం కోర్టు ఆమోద ముద్ర పడిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. రాష్టప్రతి పాలనను ఎత్తివేయడానికి కేంద్రం సిద్ధంగా ఉందని అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ సుప్రీం కోర్టులో వెల్లడించిన తర్వాత కేంద్ర మంత్రి వర్గం మధ్యాహ్నం స్వల్ప వ్యవధి పాటు సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.