జాతీయ వార్తలు

రాష్ట్రాన్ని ఆదుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 20: కోస్తా జిల్లాలను అతలాకుతలం చేసిన వర్షాలు, జరిగిన నష్టంపై కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్ సింగ్‌ను పౌర విమానయాన మంత్రి అశోక్‌గజపతిరాజు, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్‌రావువివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పంపిన నివేదికతో పాటు ఏపికి తక్షణ సాయంగా 1000 కోట్ల రూపాలను విడుదల చేయాలని కోరుతూ ప్రధానికి రాసిన లేఖను పిఎంఓలో అందజేశారు. హోమ్‌మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చైనా పర్యటలో ఉన్నందున సంబంధిత అధికారులకు నివేదిక ప్రతిని ఇచ్చారు. వ్యవసాయ మంత్రి రాధామోహన్ సింగ్ నివేదికను పరిశీలించి తగిన సహాయం అందచేస్తామని హామీ ఇచ్చారు. కేంద్రం అన్ని విధాలా రాష్ట్రాన్ని ఆదుకుంటుందన్న ఆశాభావాన్ని టిడిపి నేతలు వ్యక్తం చేశారు. ఇలా వుండగా కేంద్ర పరిశీలకులు సోమవారం వరద పీడిత ప్రాంతాల్లో పర్యటిస్తారని కంభంపాటి తెలిపారు.
బాబు నాయకత్వంలో
ఇబ్బందులను అధిగమిస్తున్నాం
మంత్రి అశోక్ గజపతి
ఆంధ్రభూమి బ్యూరో
న్యూఢిల్లీ, నవంబర్ 20: ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, సంప్రదాయాలను నలు దిశలా వ్యాప్తిచేస్తూ, ఆర్థిక, పారిశ్రామిక రంగాల్లో సాధించడానికి ఉన్న అవకాశాలను తెలియచేయటంలో పెవిలియన్ కీలకపాత్ర వహిస్తుందని కేంద్ర పౌర విమానయాన మంత్రి అశోక్ గజపతిరాజు చెప్పారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లోనూ గణనీయమైన అభివృధ్దిని సాధించి తీరుతుందని ఆయన స్పష్టం చేశారు. ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో జరుగుతున్న ట్రేడ్ ఫెయిర్‌లో ఆంధ్రప్రదేశ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని జరిగిన సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర విభజన వల్ల తలెత్తిన సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు సమర్ధ నాయకత్వంలో నెమ్మదిగా అధిగమిస్తున్నామని ఆయన చెప్పారు. పెట్టుబడిదారులకు ఆంధ్రప్రదేశ్ పుష్కలమైన అవకాశాలను కల్పిస్తోందని అశోక్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్‌రావుమాట్లాడుతూ విభజన తరువాత ఏపి అనేక సమస్యల్లో చిక్కుకుందని అన్నారు. పెట్టుబడులు పెట్టటానికి అనువైన పరిస్థితులున్నాని ఆయన అభిప్రాయపడ్డారు. రాజధాని నిర్మాణానికి, రాష్ట్భ్రావృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించవలసిందిగా కంభంపాటి విజ్ఞప్తి చేశారు.
26/11 కేసు విచారణకు
హాజరుకానున్న హెడ్లీ
వాషింగ్టన్, నవంబర్ 20: ముంబయి నగరంపై దాడి (26/11) కేసులో నిందితుడిగా ఉన్న పాకిస్తాన్-అమెరికన్ లష్కరే తోయిబా (ఎల్‌ఇటి) ఉగ్రవాది డేవిడ్ హెడ్లీ డిసెంబర్ 10వ తేదీన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముంబయిలోని టాడా కోర్టు విచారణకు హాజరు కానున్నాడు. హెడ్లీ తరపు న్యాయవాది జాన్ టి థెయిస్ శుక్రవారం ఇక్కడ ఈ విషయం చెప్పారు. హెడ్లీని డిసెంబర్ 10న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తన ముందు హాజరు పరచాలని ముంబయిలోని టాడా కోర్టు ఆదేశించినట్టు వచ్చిన వార్తలను తాను చూశానని ఆయన పిటిఐ వార్తాసంస్థ ప్రతినిధికి తెలిపారు. హెడ్లీ 2010 మార్చి నాటి తన ‘ప్లీ అగ్రీమెంట్’ ప్రకారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముంబయి కోర్టు విచారణకు హాజరు అవుతాడని జాన్ వివరించారు. అమెరికా అటార్నీ కార్యాలయం ఎప్పుడు ఆదేశించినా తాను ఏ విదేశీ న్యాయస్థానం విచారణకైనా హాజరు అవుతానని హెడ్లీ తన ‘ప్లీ అగ్రీమెంట్’లో పేర్కొన్నాడని ఆయన వెల్లడించారు. ముంబయి నగరంపై ఉగ్రవాద దాడికి హెడ్లీ ప్రణాళిక రూపొందించి, అమలు చేయడంలో భాగస్వామి అయినట్టు అమెరికా కోర్టు విచారణలో తేలడంతో అతనికి 35 సంవత్సరాల జైలుశిక్ష విధించారు. ప్రస్తుతం అతను ఈ శిక్షను అనుభవిస్తున్నాడు.