జాతీయ వార్తలు
నిర్భయ దోషులకు ఉరి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
న్యూఢిల్లీ: ఎట్టకేలకు నిర్భయ దోషులను ఉరితీశారు. తీహార్ జైలులు ఈ రోజు ఉదయం 5.30 గంటలకు దోషులు నలుగురు ఉరికంబానికి వేలాడారు. నలుగురు నిర్భయ దోషులు అక్షయ్ కుమార్ ఠాకూర్ (31), పవన్‌గుప్తా (25), వినయ్ శర్మ (26), ముకేష్ సింగ్ (32) దాఖలు చేసిన అన్ని పిటిషన్లను ఢిల్లీ హైకోర్టు, పటియాలా, సుప్రీం కోర్టు కొట్టివేయటంతో ఉరి శిక్ష అమలుకు అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ తన రెండో క్షమాభిక్ష పిటిషనను కొట్టివేయటాన్ని సవాల్ చేస్తూ అక్షయ్ కుమార్ ఠాకూర్ చేసిన పిటిషర్‌ను కూడా సుప్రీం కోర్టు డిస్మిస్ చేసింది. ముద్దాయిల తరఫున న్యాయవాది ఏపీ సింగ్ వ్యూహాత్మకంగా వ్యవహరించటం తెలిసిందే. ఒకరి తరువాత మరొకరి క్షమాభిక్ష పటిషన్లను పంపించటం ద్వారా ఉరి శిక్ష అమలును రెండు నెలల పాటు వాయిదా వేయించుకోగలిగారు. నిర్భయ దోషులను ఉరి తీసేందుకు ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్ నుండి ప్రత్యేకంగా రప్పించిన పవన్‌కుమార్ జల్లాద్ ఉరితీసిన తర్వాత తలారీ మీడియాతో మాట్లాడారు. ‘‘నలుగురు దోషులను ఉరి తీసిన తర్వాత నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. ఈ క్షణం కోసం నేను చాలా కాలం వేచి ఉన్నాను.’’ అని తలారీ పవన్ జల్లాద్ వ్యాఖ్యానించారు. నిర్భయ సంఘటన జరిగినప్పుడు తాను ఢిల్లీలో లేనంటూ ముకేష్ సింగ్ కోర్టును తప్పుదోవ పట్టించేందుకు విఫల యత్నం చేశాడు. నిర్భయ దోషులు నలుగురూ చట్టాలను దుర్వినియోగం చేయటం ద్వారా ఇప్పటికి మూడు సార్లు ఉరిశిక్ష తేదీలను వాయిదా వేయించుకోగలిగారు. అయితే శుక్రవారం ఉదయం ఐదున్నర గంటలకు ఉరితీత ప్రక్రియ నుంచి ఏ మాత్రం తప్పించుకునే అవకాశాలు కనిపించటం లేదు. ఆరుగురు మానవ మృగాలు 2012 డిసెంబర్ 16 తేదీనాడు బస్సులో 23 సంవత్సరాల మెడికోను అత్యంత దారుణంగా రేప్ చేసి నగరం వెలుపల పడవేసి వెళ్లటం తెలిసిందే. నిర్భయతో ఉన్న ఆమె స్నేహితుడిని అమానుషంగా కొట్టి బస్సు నుంచి నెట్టివేసి పైశాచిక ఆనందం పొందారు. అత్యంత క్రూరమైన రక్షసత్వానికి గురైన యువతి కొన్ని రోజులకు సింగపూర్ ఆసుపత్రిలో చనిపోయింది. నిర్భయను బస్సులో దారుణంగా రేప్ చేసిన ఆరుగురిలో ఒకడు మైనర్ కావటంతో వాడిని మూడేళ్లు రిఫార్మ్ హౌజ్‌లో ఉంచిన తరువాత విడుదల చేశారు. ప్రధాన సూత్రధారి రామ్‌సింగ్ తీహార్ జైలులోనే ఆత్మహత్య చేసుకున్నాడు.మిగతా నలుగురు దోషులకు శుక్రవారం ఉదయం 5.30 గంటలకు ఉరి శిక్ష అమలు చేశారు. శిక్ష అమలులో జాప్యం జరిగినా... ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకు ఉరి తీయటం ద్వారా నిర్భయకు న్యాయం చేశారు.