క్రీడాభూమి

నెవిల్, స్మిత్ అర్థ శతకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కివీస్‌పై ఆస్ట్రేలియాకు స్వల్ప ఆధిక్యం పోటాపోటీగా సాగుతున్న డే/నైట్ టెస్టు
అడెలైడ్ ఓవల్, నవంబర్ 28: ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్ల చారిత్రక మూడో టెస్టు హోరాహోరీగా సాగుతున్నది. 138 సంవత్సరాల క్రికెట్ చరిత్రలో మొట్టమొదటి డే/నైట్ టెస్టుగా రికార్డ పుటల్లోకి ఎక్కిన ఈ టెస్టు లోస్కోరింగ్ మ్యాచ్‌గా ముగిసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవెన్ స్మిత్, వికెట్‌కీపర్ పీటర్ నెవిల్ అర్ధ శతకాలతో రాణించడంతో ఆ జట్టుకు కివీస్‌పై 22 పరుగుల స్వల్ప తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. రెండు వికెట్లకు 54 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో మొదటి ఇన్నింగ్స్‌లో రెండు రోజు ఆటను కొనసాగించిన ఆస్ట్రేలియా 72.1 ఓవర్లలో 224 పరుగులకల ఆలౌటైంది. క్రిస్ వోగ్స్ 13 పరుగులు చేసి టిమ్ సౌథీ బౌలింగ్‌లో మార్టిన్ గుప్టిల్‌కు క్యాచ్ ఇవ్వడంతో శనివారం మొదలైన ఆసీస్ వికెట్ల పతనం చివరి వరకూ కొనసాగింది. స్మిత్ 114 బంతులు ఎదుర్కొని 53, నెవిల్ 110 బంతుల్లో 66 పరుగులు చేసి ఆదుకోకపోతే ఆస్ట్రేలియా రెండు వందల పరుగుల మైలురాయిని దాటి ఉండేదికాదు.లోయర్ మిడిల్ ఆర్డర్‌లో నాథన్ లియాన్ (34), మిచెల్ స్టార్క్ (24 నాటౌట్) సాయంతో నెవిల్ ఆసీస్‌ను ఆదుకున్నాడు. ఫస్ట్ డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన స్మిత్ చేసిన అర్ధ శతకం కంటే నెవిల్ హాఫ్ సెంచరీనే జట్టుకు అండగా నిలిచింది. కివీస్ బౌలర్లలో బ్రాస్‌వెల్ డౌగ్ బ్రాస్‌వెల్మూడు వికెట్లు పడగొట్టాడు. ట్రెంట్ బౌల్ట్, మార్క్ క్రెగ్ చెరి రెండు వికెట్లు కూల్చారు.
ఆస్ట్రేలియా కంటే 22 పరుగులు వెనుకంజలో నిలిచిన న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్ ఆరంభించి, రెండో రోజు ఆట ముగిసే సమయానికి 37 ఓవర్లలో 5 వికెట్లకు 116 పరుగులు చేసింది. రాస్ టేలర్ (32), కెప్టెన్ బ్రెండన్ మెక్‌కలమ్ (20) వంటి స్టార్ క్రికెటర్లు కూడా పెవిలియన్ చేరడంతో కివీస్ భారీ స్కోరు చేసే అవకాశాలకు గండిపడింది. ఆట ముగిసే సమయానికి, కెరీర్‌లో తొలి టెస్టు ఆడుతున్న మిచెల్ సాంట్నర్ 13, బిజె వాల్టింగ్ 7 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు. ఆసీస్ బౌలర్లలో జొస్ హాజెల్‌వుడ్ మూడు వికెట్లు సాధించాడు. మిచెల్ మార్ష్‌కు రెండు వికెట్లు లభించాయి. కాగా, ప్రస్తుత పరిస్థితుల్లో పోటీ తీవ్రంగా ఉన్నప్పటికీ, ఆస్ట్రేలియాకు విజయావకాశాలున్నాయి. (చిత్రం) ఆసీస్ టాప్ స్కోరర్ నెవిల్ (66)
సంక్షిప్త స్కోర్లు
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 65.2 ఓవర్లలో 202 ఆలౌట్ (టామ్ లాథమ్ 50, మిచెల్ స్టార్క్ 3/24, జొస్ హాజెల్‌వుడ్ 3/66, పీటర్ సిడిల్ 2/54, నాథన్ లియాన్ 2/42).
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 72.1 ఓవర్లలో 224 ఆలౌట్ (స్టీవెన్ స్మిత్ 53, నెవిల్ 66, నాథన్ లియాన్ 34, మిచెల్ స్టార్క్ 24 నాటౌట్, బ్రాస్‌వెల్ 3/18).
న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్: 37 ఓవర్లలో 5 వికెట్లకు 116 (రాస్ టేలర్ 32, మెక్‌కలమ్ 20, హాజెల్‌వుడ్ 3/32, మిచెల్ మార్ష్ 2/44).