జాతీయ వార్తలు

నేతాజీ మృతిపై దర్యాప్తు అక్కర్లేదన్న ఇందిర!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, జనవరి 24: స్వాతంత్య్ర యోధుడు నేతాజీ సుభాష్ చంద్ర బోస్ మృతిపై దర్యాప్తుకు భారత్-జపాన్ సంయుక్త దర్యాప్తును ఏర్పాటు చేయాలన్న అభ్యర్థనకు 1967లో అప్పటి భారత ప్రభుత్వం ఇష్టపడలేదు. జపాన్ ఆర్మీ రిటైర్డ్ అధికారి ఇవయిచి ఫుజివారా ఈ అభ్యర్థన చేశారు. ఫుజివారా కోల్‌కతాలోని నేతాజీ మ్యూజియంకు ఆయనకు చెందిన కత్తిని అందజేయడానికి 1967 మార్చి 19న నగరానికి వచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేతాజీ అదృశ్యం వెనుక మిస్టరీని ఛేదించడానికి భారత్, జపాన్ ప్రభుత్వం ఒక సంయుక్త దర్యాప్తు సంఘాన్ని ఏర్పాటు చేయాలని అన్నారు. అయితే సంయుక్త దర్యాప్తుపై ఫుజివారా చేసిన ప్రకటన గురించి అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి తెలుసునని నేతాజీ 119 జయంతిని పురస్కరించుకుని శనివారం నరేంద్ర మోదీ ప్రభుత్వం విడుదల చేసిన వంద రహస్య దస్త్రాల్లోని ఓ ఫైలును బట్టి తెలుస్తోంది. సంయుక్త దర్యాప్తు సంఘాలను ఏర్పాటు చేయడానికి చొరవ తీసుకోవాలని ప్రభుత్వం ఎలాంటి ప్రతిపాదనా చేయలేదని 1967 ఏప్రిల్ 3న లోక్‌సభకు ఇచ్చిన ఓ సమాధానంలో అప్పటి విదేశాంగ మంత్రి ఎంసి చాగ్లా చెప్పారు. ఫుజివారా అభ్యర్థనను తోసిపుచ్చడానికి కారణాలలో నేతాజీ మృతి మిస్టరీపై దర్యాప్తు జరపడానికి 1956లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన షా నవాజ్ కమిటీ ఇచ్చిన నివేదిక కచ్చితంగా ఉందని ప్రభుత్వం భావించడమేనని చావ్లా తన సమాధానంలో తెలిపారు. అన్ని సాక్ష్యాధారాలను పరిశీలించిన తర్వాత 1945లో జరిగిన విమాన ప్రమాదంలో నేతాజీ మృతి చెందినట్లు నిర్ధారణ అయిందని పేర్కొంటూ షా నవాజ్ కమిటీ ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించింది. ‘ఈ నివేదిక కచ్చితంగా ఉందని, మరోసారి దర్యాప్తు జరిపించాల్సిన అవసరం లేదని ప్రభుత్వం భావిస్తోంది. అంతేకాదు లెఫ్టెనెంట్ జనరల్ ఫుజివారా కొత్త వాస్తవాలను ఏమీ వెల్లడించలేదు’ అని చావ్లా తన సమాధానంలో తెలిపారు.