జాతీయ వార్తలు

ఆనందిబెన్‌కు ఉద్వాసన?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాంధీనగర్, మే 16: గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందిబెన్ పటేల్‌కు స్థానభ్రంశం తప్పదా? బీజేపీ వర్గాలు అవుననే అంటున్నాయి. రాష్ట్రానికి వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి అధికారాన్ని దక్కించుకోవటానికి ముఖ్యమంత్రి మార్పు తప్పదన్న నిర్ణయానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇద్దరు నేతలకు గుజరాత్ సొంత రాష్ట్రం కావటంతో రాబోయే అసెంబ్లీ ఎన్నికలు అత్యంత ప్రతిష్ఠాత్మకం అవుతున్నాయి. దీంతో ఇద్దరు నేతల మధ్య పలు దఫాల సమావేశాలు, మంతనాల అనంతరం ఆనందిబెన్‌ను మార్చాలన్న నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఆనందిబెన్‌ను ఏదైనా రాష్ట్రానికి గవర్నర్‌గా పంపించి, ఆమె స్థానంలో గుజరాత్ కేబినెట్‌లో కీలక బాధ్యతలు మోస్తున్న మంత్రి నితిన్‌భాయ్ పటేల్‌కు సీఎం సీటు అప్పగించవచ్చని భావిస్తున్నారు. గత వారమే నితిన్‌భాయ్ ఢిల్లీలో ప్రధానితో భేటీ అయ్యారు.
2014 లోక్‌సభ ఎన్నికల్లో భారీవిజయం నమోదు చేసి ప్రధాని పదవి చేపట్టిన అనంతరం గుజరాత్ ముఖ్యమంత్రిగా ఆనందిబెన్‌ను తన స్థానంలో మోదీ కూర్చోబెట్టిన సంగతి తెలిసిందే. గుజరాత్‌లో పటేళ్ల రిజర్వేషన్ ఉద్యమం ఊపందుకోవటం, ఉద్యమ నాయకుడు 23 ఏళ్ల హార్దిక్ పటేల్ రాజద్రోహం కేసులో 200రోజులపాటు జైల్లో గడపడం వంటి పరిణామాలు బీజేపీ ఇమేజిని బాగా దెబ్బతీశాయి. అంతేకాదు.. గుజరాత్‌లో రాజకీయ పరిస్థితిని పార్టీకి అనుకూలంగా నిలబెట్టడంలో ఆనందిబెన్ విఫలమయ్యారని, బీజేపీ రాష్ట్ర శాఖలో కూడా అంతర్గత యుద్ధం పరాకాష్టకు చేరుకుందని మోదీకి నమ్మకస్తుడైన పార్టీ నేత ఓం మాథుర్ ఆయనకు నివేదిక ఇచ్చినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ నివేదిక ప్రకారం ఆనందిబెన్ పనితీరు చాలా పేలవంగా ఉందని, రాష్ట్ర ప్రభుత్వానికి, పార్టీ రాష్ట్ర శాఖకు మధ్య సమన్వయం పూర్తిగా కొరవడిందని పేర్కొన్నట్లు బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. గత 15రోజుల వ్యవధిలో ఓం మాథుర్, మోదీ-అమిత్‌షాలను రెండుసార్లు కలిసి రాష్ట్ర పరిస్థితిని చర్చించారు. ఈ ఏడాదితో ఆనందిబెన్ వయసు 75కు చేరుకుంటుంది కాబట్టి ఆ కారణం చూపించి ఆమెను తప్పించే అవకాశాలు ఉన్నట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

చిత్రం ఢిల్లీలో సోమవారం ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమైన ఆనందిబెన్