జాతీయ వార్తలు

ఆ దాడి నాపై జరిగినట్టే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాట్నా, మే 16: బిహార్‌లో పాత్రికేయుడు రాజ్‌డియో రంజన్ హత్యపై దర్యాప్తు జరుగుతోందని ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ వెల్లడించారు. హతుడి కుటుంబ సభ్యులకు బిహార్ పోలీసుల దర్యాప్తుపై నమ్మకం లేదని చెబితే సిబిఐ విచారణకు సిఫార్సు చేస్తామని సోమవారం ఇక్కడ ప్రకటించారు. జర్నలిస్టు హత్యపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన నితీశ్ జర్నలిస్టు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాజన్ హత్యను తీవ్రంగా ఖండించిన నితీశ్ జర్నలిస్టుపై దాడి. తనపై జరిగిన దాడిగా అభివర్ణించారు. బిహార్ రాష్ట్ర పోలీసులు అన్ని కోణాల్లోనూ కేసు దర్యాప్తు చేస్తున్నారని ఆయన తెలిపారు. ‘రాజన్ కేసును తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ హంతకులను పట్టుకుని తీరతాం. నిందితులు ఎంత పైస్థాయిలో ఉన్నప్పటికీ కఠినంగా శిక్షిస్తాం’ అని ముఖ్యమంత్రి తెలిపారు. బాధిత కుటుంబం ఆదివారం రాత్రి డిజిపిని కలిసి దర్యాప్తుపట్ల సంతృప్తిని వ్యక్తం చేశారని ఆయన వెల్లడించారు. ఒకవేళ పోలీసుల దర్యాప్తుపై తమకు నమ్మకం లేదని రాజన్ కుటుంబ సభ్యులు చెబితే సిబిఐ విచారణ జరిపిస్తామని ఆయన ప్రకటించారు. 46 ఏళ్ల రాజన్ హిందూస్థాన్ పత్రికకు బ్యూరో చీఫ్‌గా పనిచేస్తున్నారు. స్టేషన్ రోడ్‌లోని బిజీ మార్కెట్‌లో శుక్రవారం రాత్రి ఆయన దారుణహత్యకు గురయ్యారు. ఈ కేసులో మనీష్ మియాన్‌తోపాటు 12 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు సివాన్ జిల్లా ఎస్పీ సౌరవ్ కుమార్ తెలిపారు.

చిత్రం పాట్నాలో సోమవారం విలేఖరులతో మాట్లాడుతున్న నితీశ్ కుమార్