జాతీయ వార్తలు

యాడ్‌ల పేరుతో ఆప్ సర్కార్ దుబారా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 16: ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఢిల్లీ ఆమ్ ఆద్మీ ప్రభుత్వం వివిధ పత్రికలకు ప్రకటనల నిమిత్తం రోజుకు 16 రూపాయలు ఖర్చుచేస్తోంది. ప్రభుత్వ నిధుల పొదుపుపై నిత్యం ఉపన్యాసాలు ఇచ్చే కేజ్రీవాల్ లక్షలాది రూపాయలు ఖర్చుచేయడం దుబారా కాదా అన్ని ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. ఆప్ ప్రభుత్వం అడ్వర్‌టైజ్‌మెంట్లపై ఆర్‌టిఐను ఆశ్రయించగా ఈ వివరాలు తెలిశాయి. 91 రోజుల్లో ప్రింట్ మీడియాలో ప్రకటనలకు కేజ్రీవాల్ ప్రభుత్వం చేసిన వ్యయం 14.45 కోట్లని ఆర్‌టిఐ వెల్లడించింది. ఢిల్లీనుంచి వెలువడే పత్రికలే కాకుండా మలయాళం, కన్నడ డైలీలో యాడ్‌లు ఇచ్చినట్టు తెలిపారు. అయితే దీన్ని ఆప్ ప్రభుత్వం సమర్థించుకుంది. ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో అవగాహన తీసుకురావాలన్న ఉద్దేశంతోనే ప్రకటనలు జారీ చేయాల్సి వచ్చిందని కేజ్రీవాల్ సర్కార్ స్పష్టం చేసింది. ఆప్ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం 80కోట్ల రూపాయలు యాడ్‌లపై ఖర్చుచేసింది. గత ఏడాది పత్రికల్లో ప్రకటన నిమిత్తం రాష్ట్ర బడ్జెట్‌లో 500 కోట్ల రూపాయలు కేజ్రీవాల్ ప్రభుత్వం కేటాయించింది. యాడ్‌ల పేరుతో విచ్చలవిడిగా నిధులు ఖర్చుచేయడాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కోర్టులో సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది. దేశ వ్యాప్తంగా పట్టణాలు, నగరాల్లో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాకు కేజ్రీవాల్ సర్కార్ ప్రకటనలు గుప్పించిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఢిల్లీ ప్రజల నుంచి పన్నులు వసూలు చేసి రాష్ట్రేతర నగరాలైన హైదారాబాద్, బెంగళూరు, చెన్నైలలో ప్రకటనలు ఇవ్వడం ఏమిటని వారు నిలదీస్తున్నారు. పారిశుధ్య కార్మికులకు జీతాలు ఇవ్వడానికి నిధులు లేవంటున్న కేజ్రీవాల్ సొంత ప్రచారంకోసం యాడ్‌లు ఇస్తున్నారని ఢిల్లీ పిసిసి అధ్యక్షుడు అజయ్ మాకెన్ విమర్శించారు.