జాతీయ వార్తలు

కారుణ్య మరణాలపై ప్రజాభిప్రాయ సేకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 16: కేంద్ర ప్రభుత్వం కారుణ్య మరణాల బిల్లు ముసాయిదాపై అభిప్రాయాలు తెలపాల్సిందిగా ప్రజలను కోరింది. ఈ బిల్లు చట్టరూపం దాలిస్తే కోలుకోవడానికి ఏమాత్రం అవకాశం లేకుండా కేవలం ఔషధాలు, చికిత్స ఆధారంగా ప్రాణాలతో ఉంటూ అవస్థపడుతున్న రోగులు నొప్పి తెలియకుండా మరణించడానికి వీలవుతుంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ‘మెడికల్ ట్రీట్‌మెంట్ ఆఫ్ టర్మినల్లీ ఇల్ పేషెంట్స్ (ప్రొటెక్షన్ ఆఫ్ పేషెంట్స్ అండ్ మెడికల్ ప్రాక్టీషనర్స్)’ బిల్లు ముసాయిదాను ప్రజాభిప్రాయ సేకరణకోసం విడుదల చేసింది. వివిధ వర్గాలకు చెందిన ప్రజలు జూన్ 19వ తేదీలోగా తమ అభిప్రాయాలను తెలియజేయాలని సూచించింది. లా కమిషన్ తన 241వ నివేదికలో సిఫారసు చేసిన ఈ కారుణ్య మరణాల ముసాయిదా బిల్లుతోపాటు దానికి సంబంధించిన సంక్షిప్త వివరణను కూడా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రజలకు అందుబాటులో ఉంచినట్లు ఆ శాఖ అండర్ సెక్రెటరీ సునిల్ కుమార్ సంతకంతో వెలువడిన నోటిఫికేషన్ వెల్లడించింది. ప్రజలు తమ అభిప్రాయాలను ఈ-మెయిల్ ద్వారా కూడా పంపించవచ్చు. నిపుణుల నివేదిక ఆధారంగా కారుణ్య మరణాలకు నియంత్రణ నిబంధనలను రూపొందించే అంశాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ 2006లో పరిశీలించింది. అయితే దీనికి సంబంధించి చట్టం తయారు చేయకూడదనే నిర్ణయానికి వచ్చింది. తరువాత కాలంలో సుప్రీంకోర్టు 2011లో ఇచ్చిన తన తీర్పులో కారుణ్య మరణాలను అమలు చేయడానికి సమగ్రమైన మార్గదర్శకాలను రూపొందించింది. కారుణ్య మరణాలకు సంబంధించి చట్టం రూపొందించే వరకు ఈ నిబంధనల ప్రక్రియను దేశవ్యాప్తంగా అనుసరించాలని సూచించింది. లా కమిషన్ 2012లో దీనికి సంబంధించిన చట్టాన్ని రూపొందించాలని మరోసారి ప్రతిపాదించింది. ఇందుకు సంబంధించి బిల్లు ముసాయిదాను కూడా రూపొందించింది.

26/11 ఉగ్రవాదుల దాడులలో తీవ్రంగా గాయపడి మంచంపట్టిన తన భర్త శ్యామ్‌సుందర్‌కు కారుణ్య మరణాన్ని ప్రసాదించాలని కోరిన బేబీ చౌదరి (ఫైల్ ఫొటో)