జాతీయ వార్తలు

వాయిదా వేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 16: నీట్ నిర్వహణకు మెజారిటీ రాష్ట్రాలు అంగీకరించాయి. అయితే ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ సహ కొన్ని రాష్ట్రాలు మాత్రం నీట్‌కు ఆమోదం తెలియజేస్తూనే తమకు ఒకటి,రెండు సంవత్సరాల పాటు మినహాయింపు ఇవ్వాలని కోరినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి జె.డి.నడ్డా వెల్లడించారు. నీట్‌ను అమలు చేయటంపై ఆయా రాష్ట్రాలు వ్యక్తం చేసిన అభ్యంతరాలను సుప్రీం కోర్టు ముందు పెట్టి ఈ సమస్యను వీలున్నంత త్వరగా పరిష్కరిస్తామని ప్రకటించారు. సోమవారం ఉదయం రాష్ట్రాల వైద్య శాఖ మంత్రులతో మాట్లాడిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. నీట్‌ను అమలు చేసే విషయంలో పలు రాష్ట్రాలు మూడు ముఖ్యమైన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చాయి.కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాలు వెల్లడించిన అభ్యంతరాలు ఇతర సమస్యలను లోతుగా అధ్యయనం చేసిన అనంతరం వీలున్నంత త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకంటామని, సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. నీట్‌కు అన్ని రాష్ట్రాలు అంగీకరించటం శుభ పరిణామమని నడ్డా అన్నారు. నీట్ నిర్వహణపై రాష్ట్రాలు ప్రధానంగా మూడు సమస్యలను తమ ముందు పెట్టాయన్నారు.తమ రాష్ట్రాల్లో ఇప్పటికే వైద్య ప్రవేశ పరీక్షలు నిర్వహించటం పూర్తి అయ్యిందని, నీట్ పరీక్ష సిలబస్‌కు రాష్ట్రాల సిలబస్ వేరువేరుగా ఉన్నందున ఈ సంవత్సరం నీట్‌లో పాల్గొనటం కష్టమని మంత్రులు చెప్పారని ఆయన వెళ్లడించారు. బాషాపరమైన సమస్యలున్నందున దక్షిణాది రాష్ట్రాల విద్యార్థులు ఈ సంవత్సరం నీట్ పరీక్షకు హాజరు కావటం కష్టమని ఆయా రాష్ట్రాల మంత్రులు చెప్పారన్నారు. రెండేళ్ల పాటు ఆంధ్ర ప్రదేశ్, ఏడాది గడువుకావాలని తెలంగాణ రాష్ట్రాలు స్పష్టం చేశాయి. కేంద్ర మంత్రి నడ్డా నిర్వహించిన ఈ సమావేశానికి తెలంగాణ నుంచి వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్వర్ తివారీ, కాళోజీ వైద్య విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ కరుణాకర్ రెడ్డి హాజరయ్యారు. ఆంధ్ర ప్రదేశ్ నుంచి హాజరైన ఆరోగ్య మంత్రి కామినేని శ్రీనివాస్ నీట్ అమలుకు రెండేళ్ల గడువు కావాలని కోరారు. నీట్ వల్ల ఎమ్సెట్‌లో వైద్య విద్య సహా మొత్తం 13 కోర్సుల్లో ఇబ్బందులు ఎదురవుతాయన్నారు.
కాగా రాష్ట్రాలు వ్యక్తం చేసిన అభ్యంతరాలను సుప్రీంకు నివేదించి పరిష్కారం కోరతామని నడ్డా వెల్లడించారు. అసలు సమస్యను పరిష్కరించకుండా నీట్‌కు హాజరు కావాలని పట్టుపట్టటం మంచి విధానం కాదనేది పలువురు మంత్రులు స్పష్టం చేశారన్నారు. భాష కూడా ఒక పెద్ద సమస్యగా మారిందంటూ స్థానిక భాషలో పరీక్షలు రాసేందుకు అలవాటు పడిన తమ విద్యార్థులు నీట్‌కు ఎలా హాజరవుతారని రాష్ట్రాల మంత్రులు ప్రశ్నించారని కేంద్ర మంత్రి చెప్పారు.వైద్య ఆరోగ్య శాఖ కార్యాచరణ కార్యక్రమాన్ని సిద్ధం చేసిన తరువాత సుప్రీం కోర్టు ముందుకు వెళతామన్నారు. కేంద్ర ప్రభుత్వం నిజంగానే సీరియస్‌గా ఉంటే నీట్‌ను కొంత కాలం నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేయవచ్చు కదా అని ఒక విలేఖరి సూచించగా అందరితో చర్చించిన అనంతరం ఒక నిర్ణయానికి వస్తామని, అంత వరకూ వేచి ఉండాలని నడ్డా సూచించారు. ప్రైవేట్ మెడికల్ కాలేజీల యాజమాన్యాలు నీట్‌ను అపేందుకు ప్రయత్నిస్తున్నాయని ఒక విలేకరి సూచించగా మిగతా అంశాలపై ఇప్పుడు దృష్టి కేంద్రీకరించటం మంచిది కాదని మంత్రి సూచించారు.
నీట్ అమలు విషయంలో రాష్ట్రాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో సోమవారం రాత్రి కేంద్ర ప్రభుత్వం అఖిల పక్ష సమావేశం నిర్వహించింది. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వివిధ పార్టీల నేతలు హాజరయ్యారు. నీట్‌పై విద్యార్థుల నుంచి తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్నందున కేంద్రం ఈ సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని కోరాయి. ఈ సమావేశానికి తెలుగురాష్ట్రాల్లో అధికార పార్టీలైన టిఆర్‌ఎస్, టిడిపిల నుంచి ఎవరూ హాజరు కాలేదు. ఉదయం నడ్డాతో జరిగిన సమావేశంలో ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తమయ్యాయో అఖిల పక్షంలో కూడా అదే వాదనను అన్ని రాష్ట్రాలు వినిపించాయి. నీట్‌పై విద్యార్థులు ఆందోళన చెందుతున్నందున ఈ ఏడాదికి నీట్‌ను నిర్వహించవద్దని ఈ అఖిల పక్ష సమావేశంలో కేంద్రానికి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేసింది.