జాతీయ వార్తలు

అసోంలో కమలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 16: జాతీయస్థాయిలో తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వచ్చి.. ఆ తరువాత వరుస ఎన్నికల్లో ఓటమిపాలై తలబొప్పి కట్టిన టీం మోదీకి అస్సాం రూపంలో ఊరట లభించనుంది. అయిదు రాష్ట్రాల్లో తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అస్సాంలో బీజేపీ తన మిత్రపక్షాలతో అధికారం చేపడుతుందని ఎగ్జిట్‌పోల్స్ చెప్తున్నాయి. ఎన్నికలు జరిగిన అయిదు రాష్ట్రాల్లో పెద్ద రాష్ట్రం పశ్చిమబెంగాల్‌లో మమతాబెనర్జీ వరుసగా రెండోసారి అధికారం చేపట్టనున్నారు. అటు కేరళలో ఎప్పటిలాగే అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీ ఎఫ్‌ను గద్దె దించి వామపక్ష కూటమిని అందలమెక్కిస్తారని ఫలితాలు వెల్లడిస్తున్నాయి. ఇక పుదుచ్చేరీలో మాత్రం కాంగ్రెస్ తన అధికారాన్ని కాపాడుకుంటోంది. అత్యంత సంక్లిష్టంగా జరిగిన తమిళనాడు ఎన్నికల్లో ఎవరికి అధికారం వస్తుందన్న దానిపై ఒక్కో సర్వే ఒక్కో రకంగా చెప్తూ వచ్చింది. ఒక సర్వే అన్నాడిఎంకే తిరిగి అధికారంలోకి వస్తుందంటే.. మరో సర్వే డీఎంకేకు పట్టం కట్టింది. వరుస ఓటములతో సతమతమవుతున్న బీజేపీకి ఈ ఎన్నికలు కొంత ఊరటనిస్తున్నాయి. అస్సాంలో అధికారం చేజిక్కించుకునే అవకాశంతో పాటు పశ్చిమ బెంగాల్‌లో తన అస్తిత్వాన్ని కొంతమేర బలపరుచుకుంటుందని సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఇక కేరళ అసెంబ్లీలోనూ బీజేపీ ఖాతా తెరుస్తుందన్న వార్త ఆ పార్టీకి శుభవార్తే. కాంగ్రెస్ పార్టీ అస్సాంతో పాటు కేరళలోనూ అధికారాన్ని కోల్పోతుందని ఎగ్జిట్ పోల్స్ సూచిస్తున్నాయి.
అస్సాంలో బి.జె.పి దాని మిత్ర పక్షాలైన అస్సాం గణ పరిషత్ బోడోలాండ్ పార్టీ కలిసి రాష్ట్రంలోని మొత్తం 126 సీట్లలో 70-85 సీట్లు గెలుచుకునే అవకాశాలున్నాయని అంచనా. కాగా, అధికారంలో ఉన్న కాంగ్రెస్ 30-35 స్థానాలకే పరిమితమవుతోంది. ముస్లిం మైనారిటీ ఓట్లతో కింగ్‌మేకర్ పాత్ర నిర్వహించాలనుకున్న కాంగ్రెస్ సానుభూతిపరుడు బదురుద్దీన్ నాయకత్వంలోని ఏ.ఐ.యు.డి.ఎఫ్‌కు 13-18సీట్లు రావచ్చు. బిజెపి అస్సాం గణ పరిషత్, బోడోలాండ్ పార్టీల కూటమి రాష్ట్ర ప్రజల మద్దతు సంపాదించటంలో విజయం సాధించాయని చెప్పవచ్చు.
పశ్చిమ బెంగాల్‌లోని మమతాబెనర్జీ రెండోసారీ అధికారంలోకి రాబోతున్నారు. ఇక్కడి 294 సీట్లలో తృణమూల్ కాంగ్రెస్ 160-180 సీట్లు గెలుచుకోబోతోందని ఎగ్జిట్‌పోల్స్ అంచనా. లెఫ్ట్-కాంగ్రెస్ కూటమి 105, బి.జె.పి 4-5 సీట్లు గెలుచుకోవచ్చని చెప్తున్నాయి. మరో ఎగ్జిట్ పోల్ ప్రకారం టిఎంసి 210 సీట్లు గెలుచుకుని భారీ విజయాన్ని నమోదు చేస్తుందని అంచనా వేస్తున్నాయి.
కేరళ శాసన సభలో 120 సీట్లలో ఎల్‌డిఎఫ్ 70-77, యుడిఎఫ్ 50-57, బిజెపి కూటమికి 5 సీట్లు రావచ్చు. కేరళ ఎన్నికల రంగంలోకి బి.జె.పి రావటంతో రాష్ట్రంలోని ముస్లింలు, క్రైస్తవులు ఎల్‌డిఎఫ్‌కు బదులు యుడిఎఫ్‌కు ఓటు వేసి వరుసగా రెండోసారి ఈ కూటమిని అధికారంలోకి తెస్తారని కాంగ్రెస్ అధినాయకత్వం వేసిన అంచనాలు తలకిందులవుతున్నాయి.
234 సీట్లున్న తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు గందరగోళంగా వెలువడ్డాయి. జయలలిత దాదాపు 130 సీట్లు గెలుచుకుని మళ్లీ అధికారంలోకి వస్తుందని ఒక సర్వే చెప్తుంటే, మరో సంస్థ మాత్రం అన్నాడిఎంకెకు కేవలం 108 సీట్లు వస్తాయని అంచనా వేసింది. డిఎంకెకు 117, ఇతరులకు 9సీట్లు గెలుచుకుంటాయంది. మరో సర్వే ప్రకారం అన్నాడిఎంకెకు 90-96 సీట్లు లభిస్తే డిఎంకె-కాంగ్రెస్ కూటమి 140-150 సీట్లతో అధికారంలోకి వస్తుందని అంచనా వేసింది.

చిత్రం ఓటు వేసేందుకు వీల్ చైర్‌లో పోలింగ్ బూత్‌కు వస్తున్న కరుణానిధి