జాతీయ వార్తలు
మీ సేవలు నిరుపమానం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
న్యూఢిల్లీ, మార్చి 22: ప్రాణాంతక కరోనాపై పోరాడుతున్న యోధులకు యావత్ భారతం చప్పట్లు, తాళాలతో ఘనంగా అభినందనలు తెలియజేసింది. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు సాయంత్రం 5 గంటల నుంచి ఐదు నిమిషాల పాటు యావత్ భారతం కోటాను కోట్ల మంది చప్పట్లతో మార్మోగింది. ఎవరికి తోచిన రీతిలో వారు దేశ వైద్య సిబ్బందికి, అత్యవసర సేవలందిస్తున్న వారికి స్పూర్తినందించే రీతిలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రాణాంతక కరోన వైరస్‌పై అహర్నిశలు శ్రమిస్తూ ఎప్పటికప్పుడు బాధితులకు చికిత్సనందిస్తూ శ్రమిస్తున్న వైద్య సిబ్బంది, ఇతర అత్యవసర సిబ్బందికి స్పూర్తినివ్వాలంటూ ఈ హర్షద్వానాలకు పిలుపునిచ్చారు. ఈ చర్య ద్వారా యావత్ భారతావని ఈ అత్యవసర సిబ్బందికి మరింత స్పూర్తిని ఇవ్వాలని, వారికి ఘనమైన రీతిలో కృతజ్ఞతలు తెలియజేయాలని మోదీ స్పష్టం చేశారు. దేశ వ్యాప్తంగా ఆదివారం జనతా కర్ఫ్యూను పాటించిన ప్రజలు అదే స్పూర్తితో సాయంత్రం 5 గంటల నుంచి ఐదు నిమిషాల పటు చప్పట్లు కొడుతూ హర్షధ్వానాలు పలికారు. ‘మీ వెంట మేమున్నాం’ అంటూ అత్యవసర సిబ్బందికి ఘనమైన రీతిలో అభినందన అందించారు. రాష్టప్రతి కోవింద్ నుంచి మొదలుకుని రాష్ట్రాల ముఖ్యమంత్రుల వరకూ మంత్రులు, అధికారులు ప్రతి పౌరుడూ ఈ కరతాళ ఉత్సవంలో పాల్గొన్నారు. చాలా మంది ప్రజలు తమ బాల్కనీల్లో బయటకు వచ్చి చప్పట్లతో పాటు తమ చేతుల్లో ఎది ఉంటే దానిని వాయిస్తూ తమ హర్షాన్ని తెలిపారు. ఇంకా కొందరైతే శంఖాలు పూరించారు, గంటలు కొట్టారు. తమ సెల్ ఫోన్లలో ఉన్న మ్యూజిక్ సిస్టంను ఇందుకు వినియోగించుకున్నారు. ఇండియా గేటు వద్ద పోలీసు సైరన్లు వినిపించాయి. బీజేపీ నేతలు జేపీ నడ్డా, రాజ్‌నాథ్ సింగ్, ధర్మేంద్ర ప్రధాన్ తదితరులు కుటుంబ సభ్యులతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ 5 గంటలకు ఐదు నిమిషాల గంట మోగించారు. హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ కూడా వినూత్న రీతిలో తమ అభినందనలు తెలిపారు. ఇలా దేశ వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఈ అభినందన కార్యక్రమంలో పాల్గొని కరోనపై పోరాడుతున్న ప్రతి ఒక్కరికీ స్పూర్తిదాయక ప్రశంసలు అందించారు.
*
ప్రాణాంతక కరోనా వైరస్‌పై పోరాడేందుకు అహర్నిశలు శ్రమిస్తున్న వైద్యులు, ఇతర సిబ్బందికి యావత్ భారతం ఘనంగా జోహార్లు అర్పించింది. రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ నుంచి మొదలుకుని అన్ని నగరాలు, పట్టణాలు, గ్రామాలు
ఆదివారం సాయంత్రం 5 గంటలకు కరతాళధ్వనులు మార్మోగాయి. బాల్కనీల నుంచి బయటకు వచ్చిన ప్రజలు ఉత్సాహంగా ఈ సిబ్బంది సేవలను శ్లాఘించారు