జాతీయ వార్తలు

మధ్యప్రదేశ్‌లో అమీతుమీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భోపాల్: మధ్యప్రదేశ్‌లో తలెత్తిన రాజకీయ హైడ్రామా చరమాంకానికి చేరుకుంది. సోమవారం నాడు తన మెజారిటీని నిరూపించుకోవాలని ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ను గవర్నర్ లాల్జీ టాండన్ ఆదేశించారు. అయితే అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలా? లేదా? అన్న అంశంపై రూలింగ్ ఇవ్వబోతున్నానని స్పీకర్ ఎన్‌పీ ప్రజాపతి వెల్లడించారు. నిన్న, మొన్నటి వరకు కాంగ్రెస్ సీనియర్ నేతగా కొనసాగిన జ్యోతిరాదిత్య సింధియా కమల్‌నాథ్‌పై తిరుగుబాటు చేయడంతో ప్రభుత్వ మనుగడ ముప్పులో పడింది. కాగా, అసెంబ్లీలో బలపరీక్షను ఎదుర్కొకుండా ఉండేందుకే కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. ఈ పరీక్షను నిర్వహించాలా? లేదా? అనేది స్పీకర్ తీసుకోవాల్సిన నిర్ణయమని కాంగ్రె స్ నేతలు అంటున్నారు. అయితే తాజా పరిణామాలపై కొత్త ఉత్సాహాన్ని సంతరించుకున్న బీజేపీ నాయకులు మాత్రం గవర్నర్ ఆదేశం ప్రకారం అసెంబ్లీలో ముఖ్యమంత్రి కమల్‌నాథ్ తన మెజారిటీని నిరూపించుకోవాల్సిందేనని చెబుతున్నారు. ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామాను స్పీకర్ శనివారం ఆమోదించడంతో అసెంబ్లీలో కాంగ్రెస్ బలం 108కి పడిపోయింది. ఈ ఆరుగురితో కలిపి మొత్తం 16 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారు. అయితే మిగతా 10 మంది రాజీనామాలను స్పీకర్ ఇంత వరకు ఆమోదించలేదు. మొత్తం 220 మంది ఎమ్మెల్యేలు కలిగిన రాష్ట్ర అసెంబ్లీలో బీజేపీ సభ్యుల సంఖ్య 107 మంది. మెజారిటీ నిరూపించుకోవాలంటే ఏ పక్షానికైనా 112 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఇరకాటంలో పడింది. తాను ఆశిస్తున్న నలుగురి ఇండిపెండెంట్ల మద్దతు లభిస్తుందో లేదోనన్న అనుమానాన్ని ఆ పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. వారం పాటు నడిచిన రాజకీయ హైడ్రామా అనేక మలుపులు తిరిగింది. ఇటు అధికార కాంగ్రెస్, అటు ప్రతిపక్ష బీజేపీ తమ తమ విధేయ ఎమ్మెల్యేలను ఇతర రాష్ట్రాల్లోని కేంద్రాలకు తరలించాయి. కాగా, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జైపూర్ నుంచి ఆదివారం భోపాల్‌కు తిరిగి వచ్చారు. బీజేపీ కూడా హర్యానాలోని తమ ఎమ్మెల్యేలను వెనక్కి రప్పిస్తోంది. రెండు పార్టీలు కూడా ఇప్పటికే సోమవారం అసెంబ్లీ సమావేశానికి హాజరుకావాలని తమ, తమ ఎమ్మెల్యేలకు విప్‌లు జారీ చేశాయి. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం చూస్తే సోమవారం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి కమల్‌నాథ్ విశ్వాస పరీక్షను ఎదుర్కొవాల్సి ఉంటుంది. ఎమ్మెల్యేల రాజీనామాలు, ఇండిపెండెంట్ల మద్దతుపై నమ్మకం సడలడంతో కమల్‌నాథ్ ప్రభుత్వం ప్రస్తుతం మైనారిటీలోనే ఉంది. ఇదే విషయాన్ని గవర్నర్ కూడా స్పష్టం చేశారు. ముఖ్యంగా మొత్తం 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామాలను ఆయన ప్రస్తావించారు. ‘ఈ వాస్తవాలను బట్టి చూస్తే అసెంబ్లీలో ఈ ప్రభుత్వానికి మెజారిటీ లేదన్న విషయం స్పష్టమవుతోంది. దరిమిలా ప్రభుత్వం మైనారిటీలో పడిపోయింది’ అని గవర్నర్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో రాజ్యాంగం ప్రకారం అది ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించడానికే సోమవారం మీరు అసెంబ్లీలో బలపరీక్షను ఎదుర్కొవాలి’ అని ముఖ్యమంత్రికి గవర్నర్ స్పష్టం చేశారు. రాజ్యాంగంలోని 174, 175(2) అధికరణల ప్రకారం సోమవారం అసెంబ్లీని సమావేశపరచాలని ఆదేశిస్తున్నానని గవర్నర్ తెలిపారు. అంతేకాదు తన ప్రసంగం ముగిసిన తర్వాత అసెంబ్లీలో చేపట్టాల్సిన ఏకైక అంశం కమల్‌నాథ్ ప్రభుత్వ బలపరీక్షేనని తన లేఖలో ఆయన స్పష్టం చేశారు. అసెంబ్లీలో ఓటింగ్ ద్వారానే బలపరీక్ష నిర్వహించాలని, ఈ మొత్తం తతంగాన్ని ప్రైవేటు వ్యక్తులతో వీడియో రికార్డింగ్ చేయించాలని కూడా గవర్నర్ స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ బలపరీక్షను వాయిదా వేయడానికిగానీ, నిలిపి వేయడానికి గానీ వీల్లేదని స్పష్టం చేశారు. అయితే విశ్వాస పరీక్ష విషయంలో స్పీకర్ ప్రజాప్రతినిధి ధోరణి భిన్నంగా కనిపిస్తోంది. గవర్నర్ ఆదేశంపై అనుకూలంగా గానీ, ప్రతికూలంగాగానీ ఆయన స్పందించలేదు. ‘నా నిర్ణయం సోమవారం వెల్లడిస్తా’ అని ఆదివారం మీడియా సమావేశంలో స్పీకర్ అన్నారు. 16 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలను వెనక్కి రప్పించేందుకు ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పార్టీ విశ్వాస పరీక్ష వాయిదా పడేలా పావులు కదుపుతోంది. ఇందుకు వీలుగా స్పీకర్ నుంచి కొంత సమయాన్ని కోరాలని భావిస్తోంది. ఈ అంశంపై మాట్లాడిన రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి పీసీ శర్మ ‘విశ్వాస పరీక్షను ఎదుర్కొవాలని ముఖ్యమంత్రిని గవర్నర్ ఆదేశించినప్పటికీ ఇందుకు సంబంధించి అంతిమ నిర్ణయం తీసుకోవాల్సింది స్పీకరే’ అని తెలిపారు. అయినా కూడా అసెంబ్లీలో బలపరీక్షను సునాయసంగానే తమ ప్రభుత్వం ఎదుర్కొనగలుగుతుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను బీజేపీ బెంగళూరులోని ఒక హోటల్‌లో నిర్బంధించిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అయితే దీనిని బీజేపీ నిర్ద్వంద్వంగా ఖండించింది. అందరూ ఆశిస్తున్నట్లుగా సోమవారం అసెంబ్లీలో బలపరీక్ష జరగకపోవచ్చునని, వ్యవహారం కోర్టు వరకు కూడా వెళ్ళవచ్చని మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ బీజేపీలు పరిస్థితులు తమకు అనుకూలంగా మారితే కోర్టుకు వెళ్ళే అంశాన్ని పరిశీలిస్తున్నాయి.
*చిత్రం.... కమల్‌నాథ్