జాతీయ వార్తలు

టిక్.. టిక్.. టిక్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 15: నిర్భయ దోషుల ఉరితీత గడువు దగ్గర పడుతోంది.. మార్చి 20న ఉదయం ఐదున్నర గంటలకు నిర్భయ దోషులైన ముకేష్ కుమార్ సింగ్, పవన్ గుప్తా, వినయ్ శర్మ, అక్షయ్ కుమార్ సింగ్‌లను తీహార్ జైలులో ఉరి తీయనున్నారు. ఈ మేరకు తీహార్ జైలు అధికారులు ఏర్పాట్లు మొదలు పెట్టారు. ఉత్తరప్రదేశ్‌లో ఉంటున్న సీనియర్ జైలు అధికారి, తలారి (హ్యాంగ్‌మేన్) పవన్ జల్లాద్‌ను ఉరితీతకు మూడు రోజుల ముందే అంటే మార్చి 17వ తేదీన తమకు రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించాలని యూపీ ప్రభుత్వ యంత్రాంగాన్ని తీహార్ జైలు అధికారులు కోరారు. ‘మీరట్‌కు చెందిన తలారి పవన్ జల్లాద్‌ను దోషుల ఉరితీతకు మూడు రోజుల ముందే అంటే మార్చి 17న రిపోర్టు చేయాల్సిందిగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరాం’ అని జైళ్ల శాఖ డీజీ సందీప్ గోయల్ ఆదివారం స్పష్టం చేశారు. కాగా, నిర్భయ దోషులు నలుగురి ఉరిశిక్షకు సంబంధించి క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్టప్రతి నిర్ద్వంద్వంగా తోసిపుచ్చినప్పటికీ చట్టపరమైన అన్ని అవకాశాలను వాడుకోవడం ద్వారా శిక్ష నుంచి తప్పించుకొనే ప్రయత్నం చేయడం.. తద్వారా ఉరి తీత జాప్యం కావడం అందరికీ తెలిసిందే. జల్లాద్ మార్చి 17న తీహార్ జైలుకు రిపోర్టు చేసిన వెంటనే డమీ ఉరిలను 20వ తేదీ వరకు పదేపదే నిర్వహిస్తామని జైలు అధికారులు వివరించారు. ప్రతి రోజు దోషులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. అలాగే, వీరికి ప్రతి రోజు కౌనె్సలింగ్ నిర్వహించనున్నారు. దీంతో పాటు ముకేష్, పవన్, వినయ్‌లకు ఆఖరి అవకాశంగా వారి కుటుంబ సభ్యులతో మాట్లాడుకొనే అవకాశాన్ని కూడా కల్పించనున్నట్లు జైలు అధికారులు చెప్పారు. అక్షయ్ కుటుంబానికి ఉరిశిక్షకు ఒక రోజు ముందు హాజరు కావాల్సిందిగా లేఖ రాశారు. ఇంతవరకు ప్రతి వారం నలుగురు దోషులూ వారి వారి కుటుంబాలతో మాట్లాడే అవకాశాన్ని ఎలాంటి ఆటంకం లేకుండా ఇచ్చామని వివరించారు.