జాతీయ వార్తలు

కర్నాటకలో కరోనా బాధితుడి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు: కర్నాటకలో కరోనా వైరస్ సోకిన 76 ఏళ్ల వ్యక్తి మృతి చెందాడు. అధికారులు మాత్రం అతని మృతికి స్పష్టమైన కారణాలు ప్రకటించలేదు. కాల్‌బురిగి జిల్లా ప్రధాన కేంద్రంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. సదరు వ్యక్తి ఇటీవలే సౌదీ అరేబియా నుంచి భారత్‌కు వచ్చాడని కర్నాటక ఆరోగ్య శాఖ మంత్రి బీ శ్రీరాములు ప్రకటించారు. అయితే, కరోనా వైరస్‌తోనే అతను మృతి చెందాడు అని చెప్పడానికి స్పష్టమైన ఆధారాలేవీ లేవని అన్నారు. అంతకుముందు జిల్లా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఒక ప్రకటనలో సదరు వృద్ధుడికి కరోనా వైరస్ సోకినట్టు ప్రకటించింది. రాష్ట్రంలో నాలుగు పాజిటివ్ కేసులు ఉన్నట్టు మంత్రి శ్రీరాములు మంగళవారం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఈ వైరస్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కాల్‌బురిగిలో వృద్ధుడి మృతికి ఈ వైరస్ కారణమని చెప్పడానికి వీల్లేదని మంత్రి బుధవారం పీటీఐతో మాట్లాడుతూ తెలిపారు. సౌదీ అరేబియా నుంచి తిరిగివచ్చిన ఆ వృద్ధుడు జ్వరంతో బాధపడుతుండడంతో తొలుత స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారని అన్నారు. తర్వాత వైద్యుల సూచనల మేరకు హైదరాబాద్‌కు తరలించారని తెలిపారు. మృతి చెందిన వృద్ధుడికి ఆస్తమా సమస్యతోపాటు రక్తపోటు, అపెండిసైటిస్ తదితర సమస్యలు ఉన్నట్టు తెలిపారు. ఇలావుంటే హైదరాబాద్ నుంచి తిరిగి స్వస్థలానికి తీసుకువస్తున్న సమయంలో, మార్గమధ్యంలోనే మంగళవారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో వృద్ధుడు చనిపోయినట్టు అడిషనల్ చీఫ్ సెక్రెటరీ (హెల్త్) జవైద్ అక్తర్ తెలిపారు. ఈనెల 5న అతనిని కాల్‌బురిగి ఆసుపత్రిలో చేర్చారని, 9వ తేదీన హైదరాబాద్‌కు తరలించారని అక్తర్ వివరించారు.