జాతీయ వార్తలు
కాంగ్రెస్ ఎంపీల సస్పెన్షన్ ఎత్తివేత
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
న్యూఢిల్లీ, మార్చి 11: అధికార, ప్రతిపక్షాల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా బుధవారం ఏడుగురు కాంగ్రెస్ సభ్యులపై విధించిన సస్పెన్షన్‌ను ఉపహరించుకున్నారు. ఈ నెల 2న లోక్‌సభలో ప్రతిపక్షాల సభ్యులు ముఖ్యంగా కాంగ్రెస్ సభ్యులు వ్యవహరించిన తీరుకు బాధ పడిన స్పీకర్ ఓం బిర్లా ఆ రోజు నుంచి బుధవారం ఉదయం వరకు లోక్‌సభ నిర్వహణకు దూరంగా ఉండిపోయారు. స్పీకర్ చాంబర్‌లో కూర్చోవడం ద్వారా ఆయన ప్యానెల్ స్పీకర్లతో సభా కార్యక్రమాలను నిర్వహింపజేయడం తెలిసిందే. పార్లమెంటు చరిత్రలో మొదటిసారి స్పీకర్ వరుసుగా నాలుగు రోజుల పాటు సభకు హాజరుకాకపోవటం ఇదే మొదటిసారి. అందుకే అధికార, ప్రతిపక్షానికి చెందిన సీనియర్ నాయకులు బుధవారం మధ్యాహ్నం స్పీకర్ చాంబర్‌లో స్పీకర్ ఓం బిర్లాతో సమావేశమై సభకు హాజరు కావాల్సిందిగా విజ్జప్తి చేశారు. ఇరుపక్షాల సభ్యుల బాధ్యతతో వ్యవహరించేందుకు సిద్ధమైతేనే తాను లోక్‌సభకు హాజరవుతానని ఆయన స్పష్టం చేశారు. దీనికి ఇరుపక్షాల నాయకులు ఆంగీకరించడంతో ఓం బిర్లా బుధవారం మధ్యాహ్నం 1.30 గంటలకు లోకసభకు వచ్చి సభా కార్యక్రమాల నిర్వహణ చేపట్టారు. సభలో ఏ అంశంపైనైనా చర్చించవచ్చు, పతిపక్షం తమ నిరసన తెలియజేవచ్చు కానీ పోడియం వద్దకు వచ్చి గొడవ చేయడం, ప్లకార్డులు ప్రదర్శించడం, నినాదాలు ఇస్తూ పత్రాల లాగివేయటం వంటివి చేయరాదని ఓం బిర్లా ఇరుపక్షాల సభ్యులకు స్పష్టం చేశారు. స్పీకర్ మళ్లీ సభకు వచ్చి సభా కార్యక్రమాల నిర్వహణను చేపట్టడం పట్ల అధికార, ప్రతిపక్షాల సభ్యులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇది జరిగిన తరువాత కాంగ్రెస్ పక్షం నాయకుడు అధీర్ రంజన్ చౌదరి, ఇతర ప్రతిపక్షాల నాయకులు మాట్లాడుతూ ఏడుగురు కాంగ్రెస్ సభ్యులపై విధించిన సస్పెన్షన్‌ను తొలగించాలని స్పీకర్ ఓం బిర్లాకు విజప్తి చేశారు. ఏడుగురు సభ్యులు స్పీకర్ టేబుల్ పై నుండి పత్రాలు లాగివేయటాన్ని తాము సమర్థించటం లేదని వారు స్పష్టం చేశారు. ఏడుగురు లోక్‌సభ సభ్యులను ఎన్నుకున్న లక్షలాది మంది ఓటర్ల ప్రయోజనాల పరిరక్షణ కోసం వారి సస్పెన్షన్‌ను రద్దు చేయాలని వారంతా విజప్తి చేశారు. తదనంతరం పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి అర్జున్ రాం మేఘవాల్ లేచి ఏడుగురు సభ్యుల సస్పెన్షన్‌ను రద్దు చేసేందుకు సంబంధించిన తీర్మానాన్ని ప్రతిపాదించారు. లోక్‌సభ సస్పెన్షన్ ఎత్తివేత తీర్మానాన్ని మూజువాణి ఓటుతో ఆమోదించింది. తీర్మానానికి సభ ఆమోద ముద్ర పడగానే ఏడుగురు కాంగ్రెస్ ఎంపీలు సభలోకి వచ్చారు.