జాతీయ వార్తలు

ప్రతిపక్షాల ఎమ్మెల్యేలను కొనేస్తున్నారు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 11: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వివిధ రాష్ట్రాలలోని ప్రతిపక్షాల శాసన సభ్యులను కొనుగోలు చేస్తోందని, ప్రతిపక్షాల ప్రభుత్వాలను చోరీ చేస్తోందని రాజ్యసభలో కాంగ్రెస్ పక్షం ఉప నాయకుడు ఆనంద్ శర్మ ఆరోపించారు. ఆనంద్ శర్మ పార్లమెంటు ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సుమావేశంలో మాట్లాడుతూ మధ్య ప్రదేశ్‌లో కాంగ్రెస్ శాసన సభ్యులను బీజేపీ అపహరించిందని ఆరోపించారు. రాష్ట్రాలలో ప్రతిపక్షాలకు చెందిన ప్రభుత్వాలు కొనసాగడం బీజేపీకి ఎంత మాత్రం ఇష్టం లేదు, అందుకే శాసన సభ్యులను కొనుగోలు చేయడం ద్వారా ప్రతిపక్షాల ప్రభుత్వాలను పతనం చేసేందుకు కుట్రలు చేస్తోందని ఆనంద్ శర్మ దుయ్యబట్టారు. మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంటున్న పరిణామాలు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టువంటివని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మధ్య ప్రదేశలో కాంగ్రెస్ శాసన సభ్యులను అపహరించడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని అవమానపరిచిందని ఆయన దుయ్యబట్టారు. ప్రతిపక్షాల శాసన సభ్యులను కొనుగోలు చేయడం, అది సాధ్యం కాని పక్షంలో అపహరించడం తద్వారా ప్రతిపక్షాల ప్రభుత్వాలను పతనం చేయడంలో బీజేపీ అద్భుతమైన నైపుణ్యాన్ని సాధించిందంటూ ఆనంద్ శర్మ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. ఆయా రాష్ట్రాల్లో ప్రజల మద్దతుతో అధికారంలోకి వచ్చిన ప్రతిపక్షం ప్రభుత్వాల పట్ల బీజేపీకి ఎందుకింత అసహనమని ఆనంద్ శర్మ ప్రశ్నించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కొన్ని నియమ, నిబంధనలను పాటించాల్సి ఉంటుందనే అంశాన్ని పూర్తిగా మరిచిపోయిందని ఆయన విమర్శించారు. మధ్య ప్రదేశ్‌కు చెందిన కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను బలవంతంగా బెంగళూరుకు తీసుకుపోవడం రాజకీయ అనైతికత, ప్రజల తీర్పును అవమానపరచడమేనని ఆయన స్పష్టం చేశారు. శాసన సభ్యులను ఎత్తుకుపోవడం పార్లమెంటరీ ప్రజస్వామ్య వ్యవస్థకు గొడ్డలి పెట్టులాంటిదన్నారు.
హోలి పండుగ తరువాత పార్లమెంటు ఉభయ సభల్లో ఢిల్లీ అల్లర్లపై చర్చ జరిపిస్తామని హామీ ఇచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పుడు మాట మార్చడం సిగ్గుచేటని ఆనంద్ శర్మ విమర్శించారు. ఎన్డీఏ ప్రభుత్వం తానిచ్చిన మాటకు కూడా నిలబెట్టుకోలేకపోవడం సిగ్గు చేటన్నారు. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ప్రజాస్వామ్యానికి ఎంత మాత్రం మంచిది కాదన్నారు. కొంత కాలం క్రితం కర్నాటక, మణిపూర్, గోవా రాష్ట్రాలలో కూడా ప్రతిపక్షం శాసన సభ్యులను కొనుగోలు చేయటం ద్వారా బీజేపీ అధికారంలోకి వచ్చిందని ఆనంద్ శర్మ ఆరోపించారు.
అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు, సహజవాయువు ధరలు బాగా తగ్గిన దృష్ట్యా దేశంలో విక్రయించే పెట్రోలు, డీజిల్ ధరలు కూడా గణనీయంగా తగ్గించాలని ఆనంద్ శర్మ డిమాండ్ చేశారు.