జాతీయ వార్తలు

సింధియాకు ‘రాజ్యసభ’ కానుక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 11: కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన మధ్యప్రదేశ్ సీనియర్ నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా బుధవారం బీజేపీ తీర్థం పుచ్చుకున్న వెంటనే ప్రధాని మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. జ్యోతిరాదిత్య సింధియా పార్టీలో చేరగానే బీజేపీ ఆయనకు రాజ్యసభ టికెట్ ఇచ్చి రికార్డు సృష్టించింది. ప్రధాని మోదీ చేతుల్లో దేశ భవిష్యత్తు సురక్షితంగా ఉన్నదని సింధియా కితాబు ఇచ్చా రు. ఇప్పుడున్న కాంగ్రెస్ కాదంటూ ఆయన విమర్శించారు. సింధియా బీజేపీ కేంద్ర కార్యాలయానికి రాగానే పార్టీ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా ఆయనకు కాషాయం కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ముందు నిర్ణయించిన ప్రకారం గు రువారం సింధియా పార్టీలో చేరాల్సి ఉంది. కాగా బుధవారం మంచి రోజు కావడంతో మధ్యాహ్నం 12 గంటలకు పార్టీలో చేరాలనుకున్నారు. అయితే రాహు కాలం కొనసాగుతున్నదనే విషయం తెలియడంతో మధ్యా హ్నం 2 గంటలకు వాయిదా వేసుకున్నారు. సింధియా బీజేపీలో చేరడం స్వగృహానికి తిరిగి వచ్చినట్లు అయ్యిందని నడ్డా అన్నారు. బీజేపీ వ్యవస్థాపక సభ్యురాలు, సింధియా నాయనమ్మ విజయరాజే సింధియా గురించి ప్రస్తావిస్తూ జ్యోతిరాదిత్య సింధియా ఇప్పుడు తన కుటుంబానికి తిరిగి వస్తున్నారు, అందుకే ఆయనను స్వాగతిస్తున్నామని నడ్డా చెప్పారు.
కాంగ్రెస్‌లో పని చేయలేకపోయా..
ఇప్పుడున్న కాంగ్రెస్ పాత కాంగ్రెస్ కానేకాదు, అది ఎప్పు డో ప్రజలకు దూరమైందని సింధియా విమర్శించారు. కాంగ్రెస్‌లో ఉంటూ ప్రజలకు సేవ చేయలేకపోతున్నానని సింధియా వాపోయారు. ప్రజలకు సేవ చేసేందుకు బీజేపీ తనకు ఒక వేదికను అందజేసిందని ఆయన తెలిపారు. బీజేపీలో చేర్చుకున్నందుకు ఆయన ప్రధాని నరేంద్ర మోదీ, పార్టీ అధ్యక్షుడు నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు కృతజ్ఞతలు చెప్పారు. కాంగ్రెస్ అధినాయకత్వం ప్రస్తుత రాజకీయ వాస్తవాలను అంగీకరించే పరిస్థితిలో లేదు, కాంగ్రెస్ ప్రస్తుత వాస్తవాలను తిరస్కరిస్తోంది, ఇది మంచి విధానం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఒకప్పటి కాంగ్రెస్‌కు ప్రస్తుత కాంగ్రెస్‌కు ఎలాంటి పోలిక లేదన్నారు. మధ్య ప్రదేశ్ సర్వతోముఖాభివృద్ది విషయంలో తాను, తన సహచరులు కన్న కలలు గత 18 నెలల్లో పటాపంచలయ్యాయని సింధియా వాపోయారు.
రాజ్యసభ టికెట్
కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన మర్నాడే బీజేపీలో చేరిన సింధియాకు రాజ్యసభ టికెట్‌తో పార్టీలోకి ఆహ్వానించింది. మధ్యప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకు తన 17 మంది శాసన సభ్యులతో దోహదపడుతున్న సింధియా పార్టీలో చేరిన కొన్ని నిమిషాలకే బీజేపీ ఆయనకు రాజ్యసభ టికెట్ కేటాయించింది. రాజ్యసభకు పోటీ చేసేందుకు సింధియాతోపాటు వనవాసి కల్యాణ్ ఆశ్రమానికి చెందిన హర్షచౌహాన్‌కు బీజేపీ టికెట్లు కేటాయించింది.
*చిత్రం... న్యూఢిల్లీలో బుధవారం బీజేపీలో చేరిన మధ్యప్రదేశ్ కాంగ్రెస్ మాజీ నేత జ్యోతిరాదిత్య సింధియాను శాలువా కప్పి ఆహ్వానిస్తున్న పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా