జాతీయ వార్తలు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడుగా కరీంనగర్ లోక్‌సభ సభ్యుడు బండి సంజయ్ కుమార్ నియమితులయ్యారు. బీజేపీ అధినాయకత్వం బుధవారం ఈమేరకు ప్రకటన చేసింది. ప్రస్తుత అధ్యక్షుడు లక్ష్మణ్ స్థానంలో సంజయ్‌ను నియమించారు. సంజయ్ కూడా వెనుకబడిన వర్గాలకు చెందినవారే. యువతలో గట్టి పట్టున్న బండి సంజయ్‌కు ఆర్‌ఎస్‌ఎస్‌తో మంచి సంబంధాలున్నాయి. తెలంగాణ శాసన సభకు 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో పోటీ చేసిన సంజయ్ ఓటమి చెందారు. 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కరీంనగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ సీనియర్ నేత బీ వినోద్‌కుమార్‌ను ఆయన ఓడించారు. మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన బండి సంజయ్‌కి తెలంగాణలోని పలు జిల్లాల్లో మంచి ప్రజాదరణ ఉంది. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జీ కిషన్ రెడ్డికి సన్నిహితుడైన సంజయ్ రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయటంతోపాటు ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు నాయకత్వంలోని టీఆర్‌ఎస్‌ను, రాష్ట్ర ప్రభుత్వాన్ని సమర్థంగా ఎదుర్కొనగలుగుతారని బీజేపీ హైకమాండ్ భావిస్తోంది. తెలంగాణలో బీజేపీ సారథ్యం మున్నూరు కాపు వర్గానికే కట్టబెట్టడం ద్వారా రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఉన్న ఆ సామాజిక వర్గం, బీసీల మద్దతు సంపాదించేందుకు ఉపయోగపడుతుందని అధినాయకత్వం విశ్వసిస్తోంది. అన్ని కోణాల్లోనూ పరిశీలించిన తరువాతే కరీంనగర్ ఎంపీ సంజయ్ కుమార్‌కు బాధ్యతలు అప్పగించినట్టు తెలిసింది.

*చిత్రం...బండి సంజయ్